https://oktelugu.com/

Samantha: సరికొత్త ఆశలు, ఆశయాలు… 2022 సమంత టార్గెట్స్ ఏమిటీ?

Samantha: 2022 సమంతకు చాలా ప్రత్యేకం. ఆమె ఈ ఏడాది సరికొత్త ప్రయాణం మొదలుపెట్టనున్నారు. నాలుగేళ్ళ వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన ఆమె అనేక ఆశలు, ఆశయాలతో ముందడుగు వేయనున్నారు. 2021 సమంతకు చేదు అనుభవాలు మిగిల్చింది. ఆమెను అనేక వివాదాలు చుట్టుముట్టాయి. మానసిక ప్రశాంత కోల్పోయిన సమంత వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సమంత-నాగ చైతన్య విడాకులు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అక్టోబర్ 2న చైతు, సామ్ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విడాకుల […]

Written By:
  • Shiva
  • , Updated On : December 30, 2021 / 12:31 PM IST
    Follow us on

    Samantha: 2022 సమంతకు చాలా ప్రత్యేకం. ఆమె ఈ ఏడాది సరికొత్త ప్రయాణం మొదలుపెట్టనున్నారు. నాలుగేళ్ళ వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన ఆమె అనేక ఆశలు, ఆశయాలతో ముందడుగు వేయనున్నారు. 2021 సమంతకు చేదు అనుభవాలు మిగిల్చింది. ఆమెను అనేక వివాదాలు చుట్టుముట్టాయి. మానసిక ప్రశాంత కోల్పోయిన సమంత వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.

    Samantha

    సమంత-నాగ చైతన్య విడాకులు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అక్టోబర్ 2న చైతు, సామ్ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విడాకుల వ్యవహారంలో అందరూ సమంతను టార్గెట్ చేశారు. విడాకులకు సమంతను పూర్తిగా బాధ్యురాలిని చేశారు. అఫైర్స్ అంటగట్టి పరుష వ్యాఖ్యలు చేశారు. విడాకుల డిప్రెషన్ నుండి బయటకు రావడనికి సమంతకు నెలల సమయం పట్టింది.

    అలాగే ఆమె నటించిన ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆ సిరీస్ లో ఆమె పాత్రను వివాదాలు చుట్టుముట్టాయి. తమిళ ఆడియన్స్ ది ఫ్యామిలీ మాన్ 2 లో సమంత చేసిన రాజీ పాత్రను తప్పుబట్టారు. తమిళ్ టెర్రరిస్ట్ గా కనిపించి సమంత తమ మనోభావాలు దెబ్బతీశారని సోషల్ మీడియాలో విమర్శల దాడికి దిగారు. కోలీవుడ్ సెలబ్రిటీలు సైతం సమంతపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు.

    Also Read: నిన్ను ఇక ఎప్పుడూ నమ్ముతా.. స్టార్ హీరోపై సమంత హాట్ కామెంట్

    సమంతకు 2021 పెద్ద పీడకలగా మిగిపోతుంది. కనీసం 2022 లో ఆమె జీవితంలో ఎలాంటి వివాదాలు చోటు చేసుకోరాదని ఆమె భావిస్తున్నారు. తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో పాటు ఆమె న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం గోవా వెళ్లారు. అక్కడ వేడుకగా 2022 సంవత్సరానికి వెల్కమ్ చెప్పనున్నారు.

    కెరీర్ పరంగా సమంతకు వచ్చే ఏడాది చాలా ప్రత్యేకం కానుంది. ఆమె నటించిన రెండు పాన్ ఇండియా చిత్రాలు విడుదల కానున్నాయి. శాకుంతలం, యశోద చిత్రాలు ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్నాయి. ఈ రెండు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్నాయి. మరి 2021 సమంతను ఒంటరిని చేయగా.. 2022 ఆమెకు తోడును తీసుకు వస్తుందేమో చూడాలి.

    Also Read: గోవాలో లగ్జరీ రిసార్ట్ లో ఆమెతో సమంత సంబరాలు !

    Tags