Samantha: సమంత న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులతో ముచ్చటించారు. ఆమె సోషల్ మీడియా చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ క్రమంలో ఒక నెటిజన్ ప్రస్తుతం మీ లైఫ్ ఎలా ఉంది అని అడిగారు. అందుకు సమంత… కొంచెం భిన్నంగా ఉందని సమాధానం చెప్పారు. గతంలా లేదని సమంత పరోక్షంగా తెలియజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తన జీవితం మునుపటిలా సాధారణంగా లేదని సమంత చెప్పకనే చెప్పింది .

మరొక నెటిజెన్ మీరు తిరిగి కోలుకోవాలి. మంచి సినిమాలతో బాక్సాఫీసు వద్ద సందడి చేయాలి. మీపై ఉన్న అన్ని విమర్శలు పోవాలని కోరుకుంటున్నాను, అని సమంతకు సందేశం పెట్టాడు. సదరు నెటిజన్ కి సమంత స్పందించారు. మీ ఆశీస్సులకు ధన్యవాదాలు అన్నారు. అలాగే నాపై విమర్శలా… ఏం విమర్శలు? అని ఎదురు ప్రశ్నించారు. సమంత అది ఫన్నీగానే అడిగినప్పటికీ ఆసక్తి కలిగించింది. హీరోయిన్ గా సమంతకు ఎదురు లేదు. ప్రారంభం నుండి ఆమె స్లో అయ్యిందే లేదు. అయితే రెండేళ్లుగా ఆమె వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులు లోనవుతుంది.
2021లో ఆమెకు భర్త నాగ చైతన్యతో విభేదాలు తలెత్తాయి. దీంతో అతన్ని దూరం పెట్టింది. అదే ఏడాది అక్టోబర్ నెలలో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. సోషల్ మీడియా వేదికగా తాము పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామం సమంతపై అనేక ఆరోపణలకు కారణమైంది. సమంతను నిందిస్తూ నిరాధార కథనాలు వెలువడ్డాయి. ఆమెకు పిల్లల్ని కనడం ఇష్టం లేదని, ఎఫైర్స్ పెట్టుకున్నారంటూ సీరియస్ అలిగేషన్స్ చేశారు. ఈ పుకార్లను సమంత తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె ప్రశాంతత కోసం మిత్రుల సహాయం తీసుకున్నారు. వరుసగా ఆధ్యాత్మిక, కల్చరల్ ట్రిప్స్ కి వెళ్లారు. విడాకుల ప్రకటన అనంతరం అత్యంత క్లిష్టమైన దశను సమంత చూశారు. అందులో నుండి బయటపడ్డాక ఆమెను మయోసైటిస్ రూపంలో మరో సమస్య చుట్టుముట్టింది. ప్రస్తుతం సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం దేశ విదేశాలకు తిరుగుతున్నారు. మయోసైటిస్ ప్రాణాంతకం కాదు, అలా అని చిన్న సమస్య కూడా కాదు. నేను దీంతో పోరాడాల్సి ఉందని సమంత గత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా సమంత విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి చిత్రంలో నటిస్తున్నారు.