Pragathi: ప్రగతి అనగానే మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గుర్తుకు వస్తుంది. రెండు దశాబ్దాల కాలంలో ప్రగతి అమ్మగా, అత్తగా వందల చిత్రాల్లో నటించారు. ఈ జనరేషన్ వాళ్లకు అమ్మ అంటే ప్రగతినే. అటు మోడ్రన్ ఇటు మిడిల్ క్లాస్ రోల్స్ కి ప్రగతి చక్కగా సరిపోతారు.ప్రత్యేకమైన యాక్టింగ్ స్కిల్స్ ఆమెను బిజీ ఆర్టిస్ట్ గా చేశాయి. అయితే ప్రగతి కెరీర్ స్టార్ట్ అయ్యింది హీరోయిన్ గా అని చాలా మందికి తెలియదు. 1994లో విడుదలైన ‘వీటిలే విశేషంగా’ అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా ఆమె వెండితెరకు పరిచయం అయ్యారు. 1997 వరకు ఆమె హీరోయిన్ రోల్స్ చేశారు. అయితే చేసింది తక్కువ చిత్రాలే.

1997లో వివాహం చేసుకున్న ప్రగతి కొన్నేళ్లు పరిశ్రమకు దూరమయ్యారు. 2002లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆ ఏడాది విడుదలైన బాబీ మూవీలో మహేష్ తల్లి పాత్ర చేశారు. అప్పటికి ఆమె వయసు దాదాపు 27 ఏళ్ళు. మహేష్ కి సమానమైన వయసులో ఆయనకు తల్లిగా చేసింది ప్రగతి. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ సక్సెస్. ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నారు. తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కెరీర్ ని దెబ్బతీశాయని ప్రగతి అంటారు.
ముఖ్యంగా ఎర్లీ మ్యారేజ్ నా జీవితాన్ని 10 నుండి 20 ఏళ్ళు వెనక్కి లాగేసిందని చెబుతుంది. హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో నేను పెళ్లి చేసుకున్నాను. అది కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపిందని ప్రగతి అభిప్రాయపడ్డారు. పెళ్లి నిర్ణయం వెనుక అమాయకత్వం, మూర్ఖత్వం, నాకు అన్నీ తెలుసు అనే అహం ఉన్నాయి. పరిస్థితులు కల్పించుకొని మరీ మనం అనుకున్నది జరగాలని అనుకుంటాము. చేసింది తప్పని తెలుసుకొని బయటకు రావడం కూడా అంత సులభం కాదని ప్రగతి అన్నారు.

నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు కెరీర్ పై ఎంత ఫోకస్ పెట్టానో.. అంత ఫోకస్ హీరోయిన్ గా ఉన్నప్పుడు పెడితే నా లైఫ్ వేరుగా ఉండేది. రైట్ టైములో రైట్ డెసిషన్ తీసుకోకపోతే అందుకు మూల్యం చెల్లించక తప్పదని ప్రగతి అభిప్రాయపడ్డారు. ఒంగోలుకి చెందిన ప్రగతి చిన్న వయసులోనే వివాహం చేసుకుంది. కెరీర్లో ఎదుగుతున్న రోజుల్లో పెళ్లి చేసుకుని తప్పు చేశానని ప్రగతి భావన. భర్తకు విడాకులు ఇచ్చిన ప్రగతి కూతురితో పాటు ఒంటరిగా ఉంటున్నారు. హెవీ వర్క్ అవుట్ వీడియోలు, డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రగతి హాట్ టాపిక్ అవుతూ ఉంటారు.