West Bengal :పశ్చిమ బెంగాల్(West Bengal)లోని ఓ కుటుంబం వివాహ వేడుకలో అతిథులకు అందించిన ఆరోగ్యకర విందు(Healthy Food) మెనూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సంప్రదాయ వివాహ విందుల్లో అతిథులను రుచులతో ఆకట్టుకోవడం సర్వసాధారణం, కానీ ఈ కుటుంబం ఆరోగ్య స్పహతో కూడిన వినూత్న మెనూ రూపొందించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ప్రతీ వంటకం పక్కన దాని కేలరీల వివరాలను చేర్చడం ద్వారా, అతిథులు తమ ఆహార ఎంపికలను సౌకర్యవంతంగా నిర్ణయించుకునేలా చేశారు. ఈ మెనూ రెడ్డిట్(Red it)లో వైరల్ కావడంతో, నెటిజన్లు దీన్ని ‘‘కేలరీల మోనూ’’ అంటూ ఆనందంగా స్వాగతించారు.
Also Read : ప్రజలకు వంట గ్యాస్ షాక్.. కేంద్రం తీరును తప్పు పట్టిన వైసీపీ మాజీ నేత!
ఆరోగ్యకర ఆతిథ్యం..
ఈ వివాహ విందులో అతిథుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి వంటకం కేలరీలను మెనూ(Calaries Menu)లో స్పష్టంగా పేర్కొన్నారు. ఉదాహరణకు, ఒక బెంగాలీ స్వీట్ లేదా కూరగాయ కూర యొక్క కేలరీల వివరాలు అతిథులకు తెలిసేలా చేశారు, తద్వారా వారు తమ డైట్‌కు అనుగుణంగా ఆహారం ఎంచుకోవచ్చు. ఈ ఆలోచన ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య స్పృహను ప్రతిబింబిస్తుంది, ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఏది, ఎంత తినాలో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఆనందంతో కేలరీలు బర్న్..
మెనూలో ఆరోగ్య సలహాలతోపాటు, అతిథులను ఆకర్షించే చమత్కారం కూడా ఉంది. ‘‘మీకు నచ్చినవన్నీ తినండి, అధిక కేలరీలను డ్యాన్స్ ఫ్లోర్‌లో బర్న్ చేయండి!’’ అంటూ రాసిన సందేశం అతిథులను ఆనందంగా ఆకట్టుకుంది. వివాహ వేడుకలో ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాలు, డ్యాన్స్ కార్యకలాపాలలో పాల్గొనమని ప్రోత్సహించారు. ‘‘జీఎస్టీ లేని ఆనందం’’ అంటూ చమత్కరించడం కూడా అతిథులను నవ్వించింది.
ఆహార వృథాకు చెక్..
ఈ మెనూ కేవలం ఆరోగ్యం గురించి మాత్రమే కాదు, ఆహార వథాను తగ్గించే లక్ష్యాన్ని కూడా కలిగి ఉంది. ‘‘పరిమితంగా తీసుకుని, ఆస్వాదించండి’’ అనే సందేశంతో, అతిథులు అవసరమైనంత మాత్రమే తీసుకోవాలని సూచించారు. మెనూ చివరలో, ‘‘ఆనందించడానికే వచ్చాం, కాబట్టి కంఫర్ట్‌గా ఉండండి’’ అని రాయడం ద్వారా వేడుకలో అందరూ సౌకర్యంగా ఆనందించేలా ప్రోత్సహించారు.