IKEA Shopping: నిత్యావసరాల వస్తువులు కొనుగోలు చేయడానికి ఒకప్పుడు కిరాణ కొట్టుకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ట్రెండ్ మారింది. కిరాణంకు బదులు షాపింగ్ మాల్ కు వెళ్లి అవసరమైన వస్తువులు తెచ్చుకుంటున్నాం. అయితే చిన్న సంచితో షాపింగ్ మాల్ లోకి ఎంట్రీ ఇస్తే.. తిరిగి వచ్చేటప్పుడు ఓ పెద్ద సంచిని కొనుక్కొని మరీ దానిని నింపుకొని వస్తాం.. షాపింగ్ మాల్ ఏదైనా వెళ్లే ముందు ఉండే ఆలోచన.. వెళ్లిన తరువాత ఉండదు.. అక్కడికి వెళ్లాక మనసు మారుతుంది. దీంతో అవసరం లేకున్నా కొన్ని వస్తువులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి అనుభవమే ఓ యువతికి కలిగింది. తాను దీపం కొనడానికి వచ్చి నాకంటే పొడవైన బిల్లు వచ్చేలా షాపింగ్ చేయాల్సి వచ్చిందని చెబుతోంది. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరూ తమ అనుభవాలను ఇతరులతో పంచుకుంటున్నారు. టూర్, మార్కెట్, సినిమా ఇలా ఎటు వెళ్లినా ఫొటోలు, వీడియోలు తీసి ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్, యూట్యూబ్ లో ఓ ఛానెళ్ల ద్వారా షేర్ చేస్తున్నారు. లేటేస్టుగా సమీరా ఖాన్ అనే ఓ అమ్మాయి IKEA అనే షాపింగ్ మాల్ లో నిల్చొని తనకంటే పొడవైన బిల్లుతో ఫోజులిచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ‘ఈ బిల్లు నాకంటే పొడవుగా ఉంది…’ అని చమత్కారంగా కామెంట్ చేసింది.
సమీరాఖాన్ ఓ దీపం కొనడానికి IKEA కు వచ్చినట్లు చెబుతున్నారు. కానీ దీపం కొనడం మరిచిపోయిన ఇంత బిల్లు వచ్చేలా ఫర్నీచర్ కొనుగోలు చేశాను.. అని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంటే వ్యక్తులు ఎవరైనా షాపింగ్ మాల్ లోకి వచ్చేటప్పుడు చిన్న వస్తువు కొనుగోలు చేయాలని అనుకుంటారు. కానీ ఇందులోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత మన మనసులు మారిపోతాయి. ఇక్కడ ఆకర్షించే వస్తువులు చూడగానే కొనకుండా ఉండలేకపోతారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమీరాఖాన్ ఫోస్టు పై చాలా మంది రియాక్ట్ అయ్యారు. ఓ నెటిజన్ స్పందిస్తూ ‘ద్వేషించేవారు ద్వేషిస్తారు.. కానీ మనం చేసేది చేస్తాం..’ అని అన్నాడు. మరో వ్యక్తి ‘మనం కోరుకున్న వస్తువులను వదిలేసి ఇతర వస్తువులను కొనుగోలు చేస్తాం.. ఇది సర్వ సాధారణమే’ అని కామెంట్ చేశారు. సమీరాఖాన్ మాత్రమే కాకుండా చాలా మంది ఇటువంటి అనుభవాన్నే పొందుతున్నారు. IKEA, DMART ఇలా ఏ షాపింగ్ మాల్ లోకి వెళ్లినా ఇదే జరుగుతుంది.
ఒకప్పుడు అవసరం ఉన్న వరకే వస్తువులను కొనుగోలు చేశారు. కానీ షాపింగ్ మాల్ లోకి వెళ్లిన తరువాత కొన్ని వస్తువులు అవసరం లేకున్నా.. వాటి ఆకర్షణీయతకు ఫిదా అవుతున్నారు. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో నేటి కాలంలో చిన్న చిన్న కిరాణం షాపుల కంటే షాపింగ్ మాల్స్ ఎక్కువగా వెలుస్తున్నాయి. గత రెండేళ్ల కాలంలో దేశంలో షాపింగ్ మాల్ విస్తరణ విపరీతంగా పెరిగిపోయింది.