Washington: మానవ సంబంధాలు ఆర్థిక బంధాలుగా మారుతున్నాయి. డబ్బు కోసం అయిన వారినే అంతమొందించే వరకు వెళ్తున్నారు. జీవితాంతం తోడుంటానని పెళ్లి చేసుకున్న భార్యనే మట్టుబెట్టాలని ఓ ప్రబుద్ధుడు ప్లాన్ చేశాడు. కొన్ని సంఘటనలు విస్తు గొలుపుతుంటాయి. భార్యను చంపాలని అనుకున్న భర్త ఆమెను అంతం చేయడానికి వేసిన ప్రణాళిక బెడిసికొట్టింది. చివరకు ఆమె ప్రాణాలు దక్కించుకుంది. భర్త చేసిన పన్నాగం బట్ట బయలు కావడం చర్చనీయాంశంగా మారింది. భార్యాభర్తల బంధానికి మచ్చుతునకగా మారిన సంఘటనపై అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే అమెరికాలోని వాషింగ్టన్ కు చెందిన చాయ్ క్యోంగ్ అనే భర్త భార్యను చంపాలని అనుకున్నాడు. ఆమెను చంపి ఆమెకు వచ్చే డబ్బును కాజేయాలని పథకం రచించాడు. ఇందులో భాగంగా భార్యను కత్తితో పొడిచి ఆమె శరీరాన్ని టేపుతో చుట్టేసి ఓ పెట్టెలే పడేశాడు. కారులో తీసుకెళ్లి మూడు అడుగుల గోతిలో పాతేశాడు. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గోతిలో ఉన్న థరసన్ కౌంటీ షెరీఫ్ కు స్పృహ రావడంతో ఎలాగైనా బతకాలనే ఉద్దేశంతో తన యాపిల్ వాచ్ తో ఎమర్జెన్సీకి కాల్ చేసి ప్రాణాలు కాపాడుకుంది.
డబ్బు కోసం భార్యనే చంపాలని అనుకున్న ప్రబుద్ధుడి బాగోతం వెలుగులోకి రావడంతో అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తల బంధంలో బంధాలకు విలువ లేకుండా పోతోంది. భార్య రిటైర్ మెంట్ అయితే వచ్చే డబ్బు కోసం ఇంత నాటకం ఆడిన భర్త తీరును తప్పుబడుతున్నారు. మానవ సంబంధాలు దారి తప్పడంతో నాగరికత ముసుగులో మనం ఎటు వైపు వెళ్తున్నామో తెలియడం లేదు. కానీ ఇంత దారుణంగా ప్రవర్తించిన చాయ్ క్యోంగ్ వ్యవహారంపై అందరు అసహ్యించుకుంటున్నారు.

కట్టుకున్న భార్యను చంపి ఆమె డబ్బును వాడుకోవాలని చూడటం బాధాకరం. డబ్బు కోసం ఇంత దారుణానికి తెగించాలా? మూడు ముళ్ల బంధానికి ముప్పు ఏర్పడుతోంది. జీవితభాగస్వామిని దూరం చేసుకుని ఆమె డబ్బుతో జల్సాలు చేయాలని కోరుకోవడం మంచిది కాదు. బతికుండగానే ఆలిని సమాధి చేసి ఆమె డబ్బును స్వాహా చేయాలని పథకం వేయడం బాధాకరం. లోకంలో మనుసుల్లో అనుబంధాలు పెడదారి పడుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి ఘటనలు వింటేనే బాధ కలుగుతోందని పలువురు పేర్కొంటున్నారు.