Super Star Krishna: తెలుగు చలన చిత్ర పరిశ్రమకి మేలిమి బంగారం వంటి నటుడు.. తెలుగు కళామ్మతల్లికి ఎనలేని సేవలు చేసి తన ధైర్య సాహసాలతో ఇండస్ట్రీని వేరే లెవెల్ కి తీసుకెళ్లిన మహానటుడు సూపర్ స్టార్ కృష్ణ ఇటీవలే గుండెపోటు తో మరణించడం యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రం లోకి నెట్టేసిన సంగతి తెలిసిందే..ఈ దుర్ఘటన జరిగి అప్పుడే వారం రోజులు గడిచిపోయింది..ఈ వారం రోజుల్లో కృష్ణ కి గుండెపోటు రావడానికి గల కారణాలు అంటూ రోజుకో కథనం సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉన్నాయి..అవన్నీ పక్కన పెడితే కృష్ణ చనిపోవడానికి అసలు కారణం మాత్రం కుటుంబ సభ్యుల నిర్లక్ష్యమే అని ప్రచారం సాగుతోంది.. ఎందుకంటే కృష్ణకి గుండెపోటు వచ్చిన అరగంట తర్వాత ఆయనని హాస్పిటల్ కి తీసుకెళ్లి జాయిన్ చేసారు.. ఈ అరగంట ఆలస్యం వల్లే రక్త ప్రవాహం ఇతర అవయవాలకు పోవడం బ్లాక్ అయ్యి కృష్ణ స్పృహ కోల్పోవడానికి కారణం అయ్యాయని పలువురు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.

హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత వైద్యులు వెంటనే CPR చేసి కృష్ణ ప్రాణాలను ఒక రోజు వరుకు నిలపగలిగి ఆయనకీ ICU లో చికిత్స అందించారు..కానీ గుండెపోటు రావడం కారణం గా కృష్ణ శరీరం లోని ఒక్కో అవయవం పని చెయ్యడం ఆగిపోతూ వచ్చింది..అలా మల్టి ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడం వల్ల కృష్ణ కన్ను మూసారు..కుటుంబ సభ్యులు కృష్ణ కి గుండెపోటు వచ్చిన వెంటనే గమనించి హాస్పిటల్ లో చేర్చి ఉంటె ఈరోజు కోట్లాది మంది అభిమానులు ఇలా బాధపడాల్సి వచ్చేది కాదని పలువురు కామెంట్ చేస్తున్నారు.. ఆయనకీ గుండెపోటు రావడానికి ముందు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు.. ఆ రోజే తన సోదరుడు ఆదిశేషగిరిరావుతో సరదాగా రెండు గంటల పాటు ముచ్చటించారట.. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘అన్నయ్య గారికి అలా గుండెపోటు వస్తుందని మేమెవ్వరం ఊహించలేకపోయాం. కృష్ణ నిద్రపోతున్న గుండెపోటు వచ్చింది.. ఇంట్లో ఉండే బాయ్ కృష్ణ గది నుండి గురకలు రావట్లేదేంటి అని గమనించగా కృష్ణకి అప్పుడే గుండెపోటుతో స్పృహ కోల్పోయి 30 నిమిషాలు దాటేసింది. వెంటనే నాకు ఫోన్ చెయ్యగా అర్జెంటు గా హాస్పిటల్ కి తీసుకెళ్లమని చెప్పి ఆ తర్వాత నేను కూడా వెళ్లాను’ అని చెప్పుకొచ్చారు.

విజయ నిర్మల అప్పట్లో కృష్ణ బాగోగులు అన్ని చూసుకుంటూ వచ్చేవారు.. ఆమె చనిపోయిన తర్వాత కృష్ణ గారికి సంబంధించిన ప్రతి కార్యక్రమం ఆమె కొడుకు నరేష్ చూసుకుంటూ వస్తున్నాడు..కృష్ణ కి బాగా వయసొచ్చేసింది కాబట్టి అతనిని అంటిపెట్టుకొని ఒకరు ఉంటే ఈ ఉపద్రవం తప్పేది… నరేష్ షూటింగులతో బిజీగా ఉండడంతో కృష్ణ గారి బాగోగులు 24 గంటలు చూసుకోవడానికి ఒక మనిషిని నరేష్ నియమించాడు.. అతను ఆ బాధ్యత విస్మరించడం వల్లే ఈరోజు ఇలాంటి అనర్థం జరిగిందని విమర్శకులు చెప్తున్న మాట. పక్కనే ఎవరైనా ఉంటే ఇలాంటి వార్త మనం విని ఉండేవారం కాదు.