Pawan Kalyan vs Jagan: కాదేదీ దోచుకోవడానికి అనర్హం అన్నట్టుగా మారింది ఏపీలో పాలనా పరిస్థితి. వైసీపీ బ్యాచ్ దోపిడీకి పర్యాయపదంగా మారిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. తమ పార్టీ కాకుంటే.. ప్రతిపక్షాలకు చెందిన వారైతే పథకాలు కట్ చేయడం.. ఉన్న పింఛన్లు ఊడగొట్టడం.. బెదిరించి లాక్కోవడం.. ఎదురు తిరిగితే దాడులు చేయడం.. కొన్ని హత్యలు చోటుచేసుకోవడం.. వైసీపీ అరాచకాలకు ఏపీలో అడ్డూ అదుపూ లేకుండా పోతోందని.. అటు చంద్రబాబు.. ఇటు పవన్.. మీడియా కోడై కూస్తోంది. ఎన్నో సంఘటనలు మనకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.

వైసీపీ పాలనలో జరిగిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు.. మంత్రులు, ఎమ్మెల్యేల దమనకాండకు ఉదాహరణాలు ఎన్నో.. ఇప్పటంలో జనసేనకు భూములిచ్చారని ప్రతీకారంతో వాళ్లు ఇళ్లు కూలగొట్టారు. విశాఖలో ప్రజల ఆవేదన వినడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ను నిర్బంధించడాలు.. కర్నూలు వెళ్లిన చంద్రబాబుపై రాళ్లు వేయించడాలు.. ఇక ప్రతిపక్షాలకు వాయిస్ లేకుండా అరెస్ట్ లు, నిర్బంధాలు, దాడులు, చంద్రబాబు టీడీపీ ఆఫీసుకెళ్లి మరీ ధ్వంసం చేయడాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. రాయడానికి పేజీలు.. చదవడానికి మీరూ సరిపోరు.
అలాంటి వైసీపీ ఆగడాలను సుద్దపూసలా సీఎం జగన్ వెనకేసుకొచ్చాడు. వాటన్నింటికి బాధితులుగా మారిన జనసేనను, జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి నోరుపారేసుకున్నారు. వైసీపీ అన్యాయాలను గట్టిగా ఎదురిస్తున్న ‘జనసేన’ను చూసి తట్టుకోలేక ‘రౌడీ సేన’ అంటూ అక్కసు వెళ్లగక్కారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రత్యర్థీ పార్టీని ఇలా దూషించాడంటే జగన్ ఫస్ట్రేషన్ ను అర్థం చేసుకోవచ్చు.

జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తోంది. వారికి జరిగిన అన్యాయంపై పోరాడుతోంది. అసలు అన్యాయం చేసేదే వైసీపీ బ్యాచ్. అసలు సిసలు రౌడీ బ్యాచ్ ఏదైనా ఉందంటే అది వైసీపీ నేతలదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆ అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ ఒక్క ట్వీట్ తో జగన్ కు పంచ్ ఇచ్చారు.
వైసీపీ నేతల ఆగడాలపై పవన్ గీయించిన కార్టూన్ ఇప్పుడు వైసీపీకి, జగన్ కు అదిరిపోయే పంచ్ లా ఉంది. రాక్షస రాజులా జగన్ ను చూపిస్తూ..దోపిడీ దొంగల స్టైల్లో వైసీపీ నేతలను చూపిస్తూ అమాయక ప్రజలను హింసిస్తున్న వారి కార్టూన్ అదిరిపోయేలా ఉంది. ఇది ఇప్పుడు వైసీపీకి చెంప పెట్టులా ఉంది. వైసీపీ పాలన ‘రౌడీ రాజ్యం’ అని.. పవన్ కళ్యాణ్ జనసేన ప్రజలను ఆదుకునే పార్టీ అని తేటతెల్లం చేస్తోంది. ఈ ఒక్క కార్టూన్ తోనే పవన్.. జగన్ కు గట్టి పంచ్ ఇచ్చారని చెప్పొచ్చు.
— Pawan Kalyan (@PawanKalyan) November 22, 2022