TSPSC Paper Leak Praveen: పోలీస్ కావాలనుకుని గ్రూప్_1 పేపర్ లీక్ చేశాడు: సిట్ దర్యాప్తులో విస్మయకర వాస్తవాలు

TSPSC Paper Leak Praveen: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు మైండ్ బ్లాంక్ అవుతున్నది. వాస్తవానికి ప్రవీణ్ తండ్రి ఒక అడిషనల్ ఎస్పీ. విధి నిర్వహణలో ఉండగానే ఆయన కన్నుమూశారు. కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ లో ఉద్యోగం ఇచ్చింది. తర్వాత అతడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ […]

Written By: Bhaskar, Updated On : April 13, 2023 2:23 pm
Follow us on

TSPSC Paper Leak Praveen

TSPSC Paper Leak Praveen: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు మైండ్ బ్లాంక్ అవుతున్నది. వాస్తవానికి ప్రవీణ్ తండ్రి ఒక అడిషనల్ ఎస్పీ. విధి నిర్వహణలో ఉండగానే ఆయన కన్నుమూశారు. కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ లో ఉద్యోగం ఇచ్చింది. తర్వాత అతడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి బదిలీ అయ్యాడు. ఆ తర్వాత ప్రవీణ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి బదిలీ అయ్యాడు. అక్కడ నమ్మకంగా పనిచేస్తూ కార్యదర్శి అనిత రామచంద్రన్ కు దగ్గర అయ్యాడు. ఆమె వ్యక్తిగత సహాయకుడిగా చేరాడు. అంతే కాదు తన తోటి ఉద్యోగులతో నేను పోలీస్ అవుతానని తరచూ చెప్పేవాడు. ఇదే విషయాన్ని సిట్ అధికారుల విచారణలోనూ ప్రవీణ్ చెప్పాడు.

ఇక అధికారుల విచారణలో ప్రవీణ్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వాస్తవానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పనిచేసే ఉద్యోగి ఎవరూ కూడా బోర్డు అనుమతి లేకుండా ఉద్యోగ నియామక పరీక్షలు రాయకూడదు. ప్రవీణ్ కూడా బోర్డు అనుమతి తీసుకోకుండానే గ్రూప్ వన్ పరీక్ష రాశాడు. టే పేపర్ లీక్ విషయం ఎక్కడ బయటకు వస్తుందోనని భయపడి ఓఎంఆర్ షీట్ లో తప్పుగా బబ్లింగ్ చేశాడు. చివరికి దొరికిపోయి కటకటాల పాలయ్యాడు.

అయితే కమిషన్ కార్యాలయంలో నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తున్న రాజశేఖర్ కు రెండు నెలలుగా జీతం ఆగిపోయింది. దీంతో అతడి పరిస్థితి తెలుసుకున్న ప్రవీణ్ అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. జీతం పెంచే విషయమై అనిత రామచంద్రంతో మాట్లాడుతానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రెగ్యులర్ ప్రాసెస్ లోనే రాజశేఖర్ జీతం పెరిగింది. ఇదంతా నా వల్లే జరిగిందని రాజశేఖర్ ను ప్రవీణ్ నమ్మించాడు. ఎంతో ఇద్దరు మధ్య మంచి సంబంధం ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్చార్జి శంకర లక్ష్మి సిస్టం డైనమిక్ ఐపి ని మార్చి గ్రూప్ వన్ సహా మరో ఐదు పేపర్లు కొట్టేశాడు. అంతే కాదు కావాలనే డబుల్ బబ్లింగ్ చేసి క్వాలిఫై కాకుండా చూసుకున్నాడు. ఎక్కడ లీక్ విషయం బయటకు వస్తుందో అని ప్రవీణ్ ఇలా చేశానని సిట్ విచారణలో ఒప్పుకున్నాడు. తన చేతిలో ఉన్న ప్రశ్నపత్రాలను అమ్ముకొని దర్జాగా సొమ్ము చేసుకున్నాడు.

TSPSC Paper Leak Praveen

ఇక గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలో డబుల్ బబ్లింగ్ తో సుమారు 8000 మంది అనర్హతకు గురయ్యారని తెలుస్తోంది. అయితే ఈ అభ్యర్థులు తమ ఫలితాలు హాల్లో ఉండటంతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి వచ్చేవారు. ఆ సమయంలో ప్రవీణ్ వారిని ముగ్గులోకి దించడం ప్రారంభించాడు. రాంగ్ బబ్లింగ్ చేసిన వారితో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. వారితో రెగ్యులర్ టచ్ లో ఉండేవాడు. పలువురి యువతుల బలహీనతల ఆధారంగా వారిని లొంగదీసుకున్నాడు. వారితో సన్నితంగా ఉన్నప్పుడు వారి ఫోటోలను దొంగచాటుగా తీశాడు. ఇందులో వీడియోలు కూడా ఉన్నాయి. వాటిని చూపించి కూడా ఆ యువతులను బెదిరించేవాడు.