https://oktelugu.com/

Waltair Veerayya vs Veera Simha Reddy : వాల్తేరు వీరయ్య వర్సెస్ వీరసింహారెడ్డి : ఏ ట్రైలర్ బాగుందంటే.?

Waltair Veerayya vs Veera Simha Reddy : ఈ సంక్రాంతికి టాలీవుడ్ ఊగిపోవడం ఖాయం. జనాలకు నిజమైన పండుగ రాబోతోంది. ఎందుకంటే ఇద్దరు టాలీవుడ్ అగ్రహీరోల సినిమాలు సంక్రాంతి రేసులో నిలబడ్డాయి. అయితే వారిద్దరూ దాన్ని పోటీగా భావించడం లేదు. ఫ్రెండ్లీ కంటెస్ట్ అని.. తన సినిమా ‘వాల్తేరు వీరయ్య’తోపాటు బాలయ్య ‘వీరసింహారెడ్డి’ కూడా ఆడాలని చిరంజీవి పిలుపునిచ్చాడు. ఇక బాలయ్య కూడా చిరంజీవి సినిమా ఆడాలని అభిమానలకు సూచించారు. అయితే వీరిద్దరూ పోటీ లేదని […]

Written By:
  • NARESH
  • , Updated On : January 7, 2023 / 07:41 PM IST
    Follow us on

    Waltair Veerayya vs Veera Simha Reddy : ఈ సంక్రాంతికి టాలీవుడ్ ఊగిపోవడం ఖాయం. జనాలకు నిజమైన పండుగ రాబోతోంది. ఎందుకంటే ఇద్దరు టాలీవుడ్ అగ్రహీరోల సినిమాలు సంక్రాంతి రేసులో నిలబడ్డాయి. అయితే వారిద్దరూ దాన్ని పోటీగా భావించడం లేదు. ఫ్రెండ్లీ కంటెస్ట్ అని.. తన సినిమా ‘వాల్తేరు వీరయ్య’తోపాటు బాలయ్య ‘వీరసింహారెడ్డి’ కూడా ఆడాలని చిరంజీవి పిలుపునిచ్చాడు. ఇక బాలయ్య కూడా చిరంజీవి సినిమా ఆడాలని అభిమానలకు సూచించారు.

    అయితే వీరిద్దరూ పోటీ లేదని అంటున్నా ప్రతి విషయంలోనూ ఈ పోటీ కనిపిస్తోంది. వాల్తేరు వీరయ్య నుంచి సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఒక మంచి మాస్ పాట విడుదల చేయగానే.. ‘వీరసింహారెడ్డి’ నుంచి మాస్ బీట్ ను ఆ చిత్ర సంగీత దర్శకుడు థమన్ విడుదల చేసి పోటీతెచ్చాడు. ఇలా ఒక ఫస్ట్ లుక్ లు, టీజర్ ల నుంచి పాటల వరకూ చిరు, బాలయ్యలు పోటీపడ్డారు. ఈ రెండు చిత్రాల దర్శకులు పోటీపోటీగా ఇలా ప్రకటనలు చేస్తూ ఇద్దరి అభిమానులను పోటీ వాతావరణంలోకి తీసుకొచ్చారు.

    నిన్న ఒంగోలులో నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకలో బాలయ్య బాబు ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మాస్ మాసాలాగా రూపొందిన ఈ ట్రైలర్ చూస్తే మాస్ జనాలకు పూనకాలు వచ్చేలా కనిపిస్తోంది. ఒక గ్రామం కోసం బాలయ్య బాబు తీసుకున్న పట్టుదలను ఫుల్ మాస్ గా తీర్చిదిద్దారు. ఫ్యాన్స్ ఆశించే ప్రతి అంశం ఆ ట్రైలర్ లో ఉంది. ఊర మాస్ డైలాగ్స్, హై వోల్టేజ్ యాక్షన్, రొమాన్స్, సాంగ్స్… కలగలిపి పక్కా సంక్రాంతి చిత్రంగా రూపొందించారు. ఫ్యాక్షన్ కథలన్నీ దాదాపు ఒకటే కాబట్టి టేకింగ్ తో మెప్పించారు అనిపిస్తుంది.

     

    అయితే ఇప్పుడు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ అంతకుమించి అనేలా ఉంది. ఒక స్మగ్లింగ్ బ్యాక్ గ్రౌండ్.. అనంతరం ఒక బస్తీ కోసం చిరంజీవి సాగించే పోరాటం.. మధ్యలో పోలీసులు, రాజకీయ నేతలు, యాక్షన్, కామెడీ, డ్రామా; ఇలా అన్ని సమపాళ్లలో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కు ఉండే మేళవింపులు అన్నీ కూడా ఈ ట్రైలర్ పొందుపరిచారు. ఫుల్ మీల్స్ ఉన్నట్టే ఉంది. కథ ఎక్కడో మొదలై ఎటో తిరిగి ఎటో వెళ్లిపోయింది. ప్రేక్షకులు ఊహించని ట్విస్టులు, షాకులతో వాల్తేరు వీరయ్య అదిరిపోయింది. ట్రైలర్ లో చిరంజీవి వింటేజ్ మాస్ లుక్ కు పూనకాలు రావడం ఖాయమని ఆయన బాడీ లాంగ్వేజ్ ను బట్టి తెలుస్తోంది. డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్ చూస్తుంటే అదరిపోయేలా ఉన్నాయి. లాస్ట్ లో రవితేజ్ కు తనదైన మాస్ డైలాగ్స్ తో ఇచ్చిపడేసిన చిరంజీవిని ఇలా చూసి చాలా రోజులైంది. చాలా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా తీసినట్టుగా కనిపిస్తోంది.

    మొత్తం నిన్నటి వీరసింహారెడ్డి.. నేటి వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్లు రెండూ చూస్తే చిరంజీవిదే బాగుందని ఫ్యాన్స్, క్రిటిక్స్ సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి మూవీ ఫుల్ మీల్స్ తిన్నట్టుగా ఉందని అంటున్నారు. బాలయ్యది మాస్ మసాలా ఫ్యాక్షన్ మూవీలా ఉందని చెబుతున్నారు. ఈ సంక్రాంతి ట్రైలర్ పోటీలో చిరంజీవిదే గెలుపు అంటున్నారు.