Waltair Veerayya Twitter Talk: మెగా ఫ్యాన్స్ మోస్ట్ అవైటెడ్ మూవీ వాల్తేరు వీరయ్య థియేటర్స్ లో దిగింది. జనవరి 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల చేశారు. 12 అర్థరాత్రి నుండే యూఎస్ ప్రీమియర్స్ ప్రదర్శన జరుగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా బెనిఫిట్ షోల ప్రదర్శన ముగిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మూవీ ఎలా ఉందో ప్రేక్షకులు తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మెజారిటీ ఆడియన్స్ వాల్తేరు వీరయ్య చిత్రం పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మొదటి షో నుండే సినిమా బాగుందన్న మాట వినిపిస్తోంది.

ఇక ఏఏ అంశాలు నచ్చాయో కూడా తెలియజేస్తున్నారు. వాల్తేరు వీరయ్య మాస జాతర అంటున్న ఫ్యాన్స్ చిరంజీవి యాటిట్యూడ్, మేనరిజం, డాన్సులు ట్రీట్ అంటున్నారు. సినిమాకు దర్శకుడు రవీంద్ర అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ తో అదరగొట్టారని అంటున్నారు. యాక్షన్, కామెడీ, గ్లామర్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా మాస్ ఆడియన్స్ కోరుకునే ప్రతి అంశం చక్కగా బ్లెండ్ చేసి వాల్తేరు వీరయ్య రూపొందించారు అంటున్నారు.
A MEGA MASS BLOCKBUSTER ENTERTAINER #WaltairVeerayya
Everything is perfect.@dirbobby knows the pulse of fans n handles it very well
Megastar comedy timing is outstandingTreat to c @KChiruTweets & @RaviTeja_offl together.
sentiment worked really well.#PoonakaaluLoading pic.twitter.com/e4h2LZGiWo— Ritvik (@MRitvikTweets) January 13, 2023
వాల్తేరు వీరయ్య మూవీలో కీలక రోల్ చేసిన రవితేజ గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఆయన సెకండ్ హాఫ్ కి చాలా ప్లస్ అయ్యారన్న మాట వినిపిస్తోంది. ప్రేక్షకులు ఊహించని బ్రదర్ సెంటిమెంట్ కట్టిపడేసిందనేది సినిమా చూసిన వారి మాట. అన్నదమ్ములుగా రవితేజ-చిరంజీవి మధ్య సన్నివేశాలు ఐ ఫీస్ట్ అంటున్నారు. ఇద్దరు మాస్ హీరోల ఇమేజ్ కి తగ్గట్లు చిరంజీవి, రవితేజల పాత్రలను తీర్చిదిద్దిన తీరు మెప్పించింది అంటున్నారు.
@ThisIsDSP దండం పెట్టొచ్చు మీకు,
మ్యూజిక్ bgm
1st half complete superhit , నేను తీసుకెళ్లిన mb fans కూడా బాగుంది అంటున్నారు..#WaltairVeerayya— MEGA and JAGAN (@pramachandrared) January 13, 2023
శృతి గ్లామర్, దేవిశ్రీ సాంగ్స్ వాల్తేరు వీరయ్యకు అదనపు ఆకర్షణ. ఇక కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే అంత బలంగా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే సంక్రాంతి చిత్రంగా వాల్తేరు వీరయ్య దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తుంది. వాల్తేరు వీరయ్య చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది.
#WaltairVeerayya This Year First Sankranti Blockbuster…@dirbobby Anna… Congratulations To Tream… @KChiruTweets bossuuu @RaviTeja_offl @MythriOfficial ♥️♥️♥️
— vinaykumard2108 (@vinaykumard2108) January 13, 2023
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో వాల్తేరు వీరయ్య తెరకెక్కించారు. రవితేజ విక్రమ్ సాగర్ ఏఎస్పీ గా కీలక రోల్ చేశారు. శృతి హాసన్, కేథరిన్ థెరిస్సా హీరోయిన్స్. దేవిశ్రీ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. హ్యాపీగా జనాలు థియేటర్స్ లో మూవీ ఎంజాయ్ చేయవచ్చు.
Vintage #Chiranjeevi and Mass #RaviTeja
Comedy timing, dialogue deliveries, and those graceful steps .Story doesn’t work but it’s the comedy scenes which are better than Khaidi and brings back shankardada vibes.
Few scenes lag,DSP bgm powerful,songs average.#WaltairVeerayya— ℎ ☻︎ (@walkman_guy) January 13, 2023