Ravi Teja- Waltair Veerayya: తెలంగాణలో పుట్టినోళ్లకు ఇక్కడ యాస, భాష ఈజీగా వస్తుంది. ఇక కొందరు హీరోలు ఇక్కడి వారు కాకున్నా బాగానే తెలంగాణ యాస మాట్లాడుతారు.. నేర్చుకుంటారు.. ఉదాహరణకు కోటా శ్రీనివాసరావు, తనికెళ్లభరణి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నవీన్ పొలిశెట్టి లాంటి వారు తెలంగాణ యాసను బాగానే పలుకుతారు. కానీ తొలిసారి మాస్ మహారాజ రవితేజ తెలంగాణ యాసను ట్రై చేశారు. తన ఆంధ్రా మూలాలు అడ్డొచ్చాయి. ఆయన తెలంగాణ భాషను సరిగ్గా పలకలేకపోయారు. చిరంజీవి లీడ్ రోల్ లో‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో పవర్ ఫుల్ మాస్ తెలంగాణ క్యారెక్టర్ చేస్తున్న రవితేజ డైలాగుల్లో మాత్రం ఆ స్థాయి చూపించలేకపోయాడు.
మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా మాస్ మహారాజ రవితేజ కూడా నటించాడు..స్టార్ హీరో అయ్యాక రవితేజ మెగాస్టార్ తో కలిసి నటించడం ఇదే తొలిసారి..అప్పట్లో వీళ్లిద్దరూ కలిసి ‘అన్నయ్య’ అనే సినిమా లో నటించారు..అది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్..ఈ సినిమా కూడా అలాగే బంపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
తాజాగా వాల్తేరు వీరయ్యలోని ‘రవితేజ’ పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ ను వదిలారు మూవీ మేకర్. అందులో తెలంగాణ వ్యక్తిగా హీరో రవితేజ పలికిన డైలాగ్స్ సోషల్ మీడియాలో టోల్స్ కు దారితీశాయి. ఈ సినిమాలో రవితేజ ACP విక్రమ్ సాగర్ గా నటిస్తున్నాడు..వైజాగ్ పరిసర ప్రాంతాలలో స్మగ్లింగ్ చేస్తున్న మాఫియా ముఠా ని..వాళ్ళు చేస్తున్న అరాచకాలను అరికట్టడానికి ఆ ప్రాంతం లోకి అడుగుపెడతాడు రవితేజ. అయితే తెలంగాణ వ్యక్తి ఆంధ్రాలో పలికిన డైలాగులు పసలేకుండా ఉన్నాయి..
ఊర మాస్ తెలంగాణా స్లాంగ్ తో రవితేజ చెప్పిన డైలాగ్, ఫైట్ షాట్స్ లో ఆయన చూపించిన మాస్ స్వాగ్ తేలిపోయింది.. ‘’ఏమి రా వారి పిసా పిసా చేస్తున్నావ్.. నీకింకా సమజ్ కాలే నేను ఎవని అయ్యకి వినను అనీ’ అంటూ రవితేజ చెప్పిన తెలంగాణ డైలాగ్ ఏమాత్రం సూట్ కాలేదన్న టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అసలు తెలంగాణ భాష, ఉచ్చరణ, ఆ యాసను ఏమాత్రం రవితేజ పలకలేదని.. ఇన్నాళ్లుగా ఇక్కడుంటున్నా కనీసం నేర్చుకోలేదని.. అందుకే గ్లింప్స్ లో ఆ డైలాగ్స్ ఎంత పలికినా ఆంధ్రా ప్లేవర్ మాత్రమే వచ్చాయన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వెలువడుతున్నాయి. రవితేజ ఈ పాత్ర కోసమైనా ఇంకాస్త తెలంగాణ యాస, భాషపై కసరత్తు చేసి ఉండాల్సింది అని.. లేకుంటే అది సూట్ కాక అభాసుపాలు అయ్యే ప్రమాదం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.