
Waltair Veerayya Closing Collections: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో మన కళ్లారా చూసాము.రెండు డిజాస్టర్ ఫ్లాప్స్ పడేలోపు చిరంజీవి పని ఇక అయిపోయిందని అనుకున్న ప్రతీ ఒక్కరికీ దిమ్మతిరిగేలా చేసాడు మెగాస్టార్.తాను కమర్షియల్ సినిమా లోకి ఒక్కసారి అడుగుపెడితే ఎలాంటి వండర్స్ సృష్టించలేదో మరోసారి నిరూపించాడు.50 రోజులకు అతి చేరువలో ఉన్న ఈ చిత్రం సృష్టించిన కొన్ని అరుదైన రికార్డ్స్ మెగాస్టార్ తప్ప మరో హీరో సృష్టించలేడు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇప్పటికే అన్ని ప్రాంతాలలో బిజినెస్ క్లోజ్ అయ్యిపోయిన సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఎంత వసూళ్లను సాధించిందో ఒకసారి చూద్దాము.వీటిలో కొన్ని ప్రాంతాలలో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన ‘అలా వైకుంఠపురం లో’ కలెక్షన్స్ ని దాటేసింది.మరి కొన్ని ప్రాంతాలలో ఏకంగా #RRR నే కొట్టేసింది.
ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజాం 37.00 కోట్లు
సీడెడ్ 18.50 కోట్లు
ఉత్తరాంధ్ర 20.10 కోట్లు
ఈస్ట్ 13.00 కోట్లు
వెస్ట్ 7.90 కోట్లు
నెల్లూరు 4.70 కోట్లు
గుంటూరు 9.20 కోట్లు
కృష్ణ 7.90 కోట్లు
మొత్తం 118.30 కోట్లు
ఓవర్సీస్ 13.25 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 8.20 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 139.75 కోట్లు

ఓటీటీ రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో ఒక సినిమా రెండు నుండి మూడు వారాలు ఆడడమే గగనం అయిపోతుంది.అలాంటి సమయం లో కూడా ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం 50 రోజుల కేంద్రాల కౌంట్ లో సరికొత్త సంచలనం సృష్టించబోతోంది.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా 250 సెంటర్స్ లో అర్థశత దినోత్సవం జరుపుకోబోతుందని తెలుస్తుంది.మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాకి వంద రోజుల సెంటర్స్ కూడా భారీగానే ఉండబోతున్నాయట.మరి మేకర్స్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చెయ్యడానికి 50 రోజుల వేడుక చేస్తారో లేదో చూడాలి.వాళ్ళు చేసినా చెయ్యకపోయినా అభిమానులు 50 రోజుల వేడుకల్ని థియేటర్స్ లో ఘనంగా ప్లాన్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట.మరి ఆ క్రేజ్ యుఫొరియా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.