Waltair Veerayya Collections: మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం నెగటివ్ రివ్యూస్ తోనే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తూ ముందుకు దూసుకుపోతుంది..ఒక వర్గానికి సంబంధించిన మీడియా ఈ చిత్రానికి మొదటి రోజుకి ఎలాంటి రివ్యూస్ మరియు రేటింగ్స్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే..మెగాస్టార్ ఆ రివ్యూస్ అన్నిటికి అతీతంగా బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకి ఒక మైల్ స్టోన్ ని దాటుకుంటూ ముందుకు వెళ్లడం చూసి నెగటివ్ రివ్యూస్ ఇచ్చిన మీడియానే ఇప్పుడు మెగాస్టార్ ప్రభంజనం గురించి చాలా గొప్పగా ఆర్టికల్స్ రాసేలా చేసాడు.

ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం గురించి ఎంత చెప్పినా అది తక్కువ అవుతుంది..అక్కడి జనాలు మొత్తం రివ్యూస్ ని ఆధారంగా తీసుకొనే థియేటర్స్ కి కదులుతారు..కానీ ‘వాల్తేరు వీరయ్య’ విషయం లో మాత్రం రివ్యూస్ ని చెత్తబుట్టలో పడేసారు ఆడియన్స్..ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి 1 మిలియన్ డాలర్స్ వసూలు చేసిన ఈ చిత్రం మూడు రోజులకు కలిపి 17 లక్షల డాలర్స్ వసూలు చేసింది.
2 రేటింగ్స్ తో అమెరికా లో ఇంతటి ప్రభంజనం సృష్టించిన ఏకైక ఇండియన్ సినిమా గా ‘వాల్తేరు వీరయ్య’ సరికొత్త ప్రభంజనం సృష్టించింది..ఇక ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో అయితే ఈ సినిమా టికెట్స్ కోసం ఒక యుద్ధమే జరుగుతుంది..థియేటర్స్ సరిపోక చాలా చోట్ల ఈ సినిమాకి వచ్చే ఓవర్ ఫ్లో మిగిలిన సినిమాలకు ఉపయోగపడుతున్నాయి.

మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, రెండవ రోజు 15 కోట్ల రూపాయిలు,అలాగే మూడవ రోజు 18 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టింది..అలా మూడు రోజులకు కలిపి ఈ సినిమా 63 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 90 కోట్ల రూపాయలకు జరిగింది..ఆ 90 కోట్ల రూపాయిలను మొదటి వారం లోనే రికవర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు.