https://oktelugu.com/

Rahul Ramakrishna: పెళ్లి కాకుండానే తండ్రైన స్టార్ కమెడియన్… టాలీవుడ్ ని ఊపేస్తున్న న్యూస్ 

Rahul Ramakrishna: రానురాను సాంప్రదాయాలు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. పెళ్లి కాకుండానే గర్భం దాల్చడం, పిల్లల్ని కనడం ఫ్యాషన్ అయిపోయింది. ఇటీవల అలియా భట్ ఆడపిల్లను కనింది. రన్బీర్ కపూర్ తో పెళ్ళికి ముందే కాపురం చేసిన ఆమె వివాహం జరిగిన ఐదారు నెలలకే బిడ్డకు జన్మనిచ్చింది. క్రికెటర్ హార్దిక్ పాండ్యా అయితే ఇంకా దారుణం. ఒక నటితో డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన హార్దిక్ పాండ్యా… కొన్నాళ్ల తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు తెలియజేశాడు. మధ్యలో పెళ్లి స్కిప్ చేశాడు. […]

Written By:
  • Shiva
  • , Updated On : January 16, 2023 / 11:29 AM IST
    Follow us on

    Rahul Ramakrishna: రానురాను సాంప్రదాయాలు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. పెళ్లి కాకుండానే గర్భం దాల్చడం, పిల్లల్ని కనడం ఫ్యాషన్ అయిపోయింది. ఇటీవల అలియా భట్ ఆడపిల్లను కనింది. రన్బీర్ కపూర్ తో పెళ్ళికి ముందే కాపురం చేసిన ఆమె వివాహం జరిగిన ఐదారు నెలలకే బిడ్డకు జన్మనిచ్చింది. క్రికెటర్ హార్దిక్ పాండ్యా అయితే ఇంకా దారుణం. ఒక నటితో డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన హార్దిక్ పాండ్యా… కొన్నాళ్ల తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు తెలియజేశాడు. మధ్యలో పెళ్లి స్కిప్ చేశాడు. తాజాగా ఇదే ట్రెండ్ స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఫాలో అయ్యాడు.

    Rahul Ramakrishna

    రాహుల్ రామకృష్ణ గత ఏడాది తన ప్రేయసిని పరిచయం చేశాడు. హరిత అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతుననట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పెళ్లి కూడా చేసుకోబోతుననట్లు తెలియజేశాడు. అయితే హరితను పెళ్లి చేసుకున్నట్లు ఎలాంటి ప్రకటన కానీ, సమాచారం కానీ లేదు. సడన్ గా నేడు తండ్రిని అయ్యానంటూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు. ”అబ్బాయి… సంక్రాంతి రిలీజ్” అని అప్పుడే పుట్టిన బిడ్డ ఫోటో షేర్ చేశాడు. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. రాహుల్-హరితకు వివాహం జరిగిందా? లేదా? విషయంలో స్పష్టత లేదు.

    రాహుల్ భిన్నమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఆయన సోషల్ మీడియా పోస్ట్స్ సంచలనంగా ఉంటాయి. బాల్యంలో తాను లైంగిక దాడికి గురైనట్లు ఓ పోస్ట్ పెట్టాడు. అది పెద్ద న్యూస్ అయ్యింది. అలాగే సినిమాలు మానేస్తున్నట్లు మరోసారి ఓ పోస్ట్ పెట్టాడు. ఆ నెక్స్ట్ డే… డబ్బు, హోదా ఇచ్చే ఇంత లగ్జరీ లైఫ్ ఎవడైనా వదిలేస్తాడా? నేను జస్ట్ జోక్ చేశా అని కామెంట్ పెట్టాడు. రాహుల్ ట్వీట్స్ విమర్శలకు గురవుతూ ఉంటాయి.

    Rahul Ramakrishna

    ఇక నటుడిగా ఆయనది సక్సెస్ ఫుల్ జర్నీ. సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ లో నటనకు ఆయనకు సినిమా ఆఫర్స్ వచ్చాయి. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రాహుల్ రామకృష్ణకు మంచి ఆఫర్ ఇచ్చాడు. అర్జున్ రెడ్డి రాహుల్ కి మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. బ్రోచేవారెవరురా, జాతిరత్నాలు చిత్రాలతో రాహుల్ రామకృష్ణ మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు. జాతిరత్నాలు చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించింది.

    Tags