Waltair Veerayya 11 Days Collection: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం నిన్నటితో 11 రోజులు పూర్తి చేసుకుంది.. 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అలా వైకుంఠపురం లో’ చిత్రం ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో..ఈ సంక్రాంతికి విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ కూడా అదే రేంజ్ విజయాన్ని నమోదు చేసుకుంది.. పండగ సెలవులు అయిపోయిన తర్వాత కూడా వర్కింగ్ డేస్ లో ఈ రేంజ్ వసూళ్లను సాధించడం అంటే సాధారణమైన విషయం కాదు.. నిన్న కూడా ఈ చిత్రానికి దాదాపుగా 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ సినిమా ఒక చరిత్ర అనే చెప్పొచ్చు.. ఇప్పటికీ ఆ ప్రాంతం లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటుంది ఈ చిత్రం..నిన్న ఒక్క రోజే ఆ ప్రాంతంలో ఈ చిత్రానికి 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..అలా ప్రాంతాల వారీగా ఇప్పటి వరకు ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టింది ఇప్పుడు పూర్తి వివరాలు చూడబోతున్నాము.

ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజాం 32.17 కోట్లు
సీడెడ్ 16.48 కోట్లు
ఉత్తరాంధ్ర 17.41 కోట్లు
ఈస్ట్ 11.90 కోట్లు
వెస్ట్ 7.02 కోట్లు
నెల్లూరు 4.10 కోట్లు
గుంటూరు 7.02 కోట్లు
కృష్ణ 7.10 కోట్లు
———————-
మొత్తం 103.20 కోట్లు
ఓవర్సీస్ 12.50 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 7.55కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 123.25 కోట్లు
మరి కొద్దీ రోజుల్లో ఈ చిత్రం సరిలేరు నీకెవ్వరూ చిత్రం సాధించిన 130 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను దాటి టాప్-5 లోకి ఎంటర్ అవ్వబోతోంది.. ఆ తర్వాత ఈ సినిమా టార్గెట్స్ ‘సైరా నరసింహా రెడ్డి’ మరియు అలవైకుంఠపురంలో చిత్రాలే… సైరా నరసింహా రెడ్డి చిత్రం సుమారుగా 140 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.

దానికి ముందు అలా వైకుంఠపురంలో చిత్రం 150 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేసింది..సైరా కలెక్షన్స్ ని అయితే ఈ వారంలోనే దాటేస్తుంది కానీ అలవైకుంఠపురం లో చిత్రాన్ని దాటుతుందా లేదా అనేది చూడాలి..ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తే 50 – 50 ఛాన్స్ ఉంది..రిపబ్లిక్ డే మరియు వీకెండ్ ఉంది కాబట్టి 150 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు ట్రేడ్ పండితులు.