
Vizag Steel Bidding: విశాఖపట్నం ఉక్కు కర్మాగారనికి సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ మరికొద్ది గంటల్లో మిగియబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి పెద్ద పెద్ద సంస్థలు బిడ్ లు దాఖలు చేశాయి.. అయితే సింగరేణి కోరిక మేరకు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం గడువును 20 తేదీ వరకు పొడగించింది. అయితే సింగరేణి గురువారం కడపటి వార్తలు అందే వరకూ బిడ్ లో పాల్గొనలేదు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది.. అయితే చివరి నిమిషంలో కేసీఆర్ ట్విస్ట్ ఇస్తారా లేక తనకు అలవాటైన రాజకీయాలు చేస్తారా అనేది తేలాల్సి ఉంది.. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది.. అయితే దీనికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ మంత్రుల కంటే తెలంగాణ మంత్రులే ఎక్కువగా మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.. ముఖ్యమంత్రి కెసిఆర్ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ లో సింగరేణి సంస్థ పాల్గొనాలని ఆ సంస్థ అధికారులను ఆదేశించారు. అయితే ఈ బిడ్ లో సింగరేణి సంస్థ కచ్చితంగా పాల్గొంటుందని, దీని ద్వారా కెసిఆర్ ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితిని బలోపేతం చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే గత ఐదు రోజుల క్రితమే పెద్ద పెద్ద సంస్థలు బిడ్ లు దాఖలు చేశాయి. ఇక ఉక్రెయిన్ దేశానికి చెందిన ఒక సంస్థ అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఎంత ఖర్చైనా ఇస్తామని ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ తనకు గడువు కావాలని వైజాగ్ స్టీల్ యాజమాన్యాన్ని కోరడంతో 20 తేది వరకు బిడ్ దాఖలుకు గడువు ఇచ్చింది. అయితే మరికొద్ది గంటల్లో ఈ గడువు ముగియబోతోంది. అయితే ఇప్పటివరకూ సింగరేణి సంస్థ పేరుతో ఎటువంటి బిడ్ దాఖలు కాలేదు. దీంతో విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు ఏం జరుగుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం గా ఉండడంతో బిడ్ దాఖలుకు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం రాకపోయినప్పటికీ.. ఇంత వరకు బిడ్ దాఖలు కాకపోవడం అదే విషయాన్ని తెలియజేస్తోందని కార్మికులు అంటున్నారు..మరో వైపు కేంద్రం కూడా స్పష్టమైన ఆదేశాలు జారి చేయడం, కేంద్రానికి కూడా సింగరేణి లో వాటా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

అయితే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని సింగరేణి టేక్ ఓవర్ చేసుకుంటుందని కార్మికులు ఆశతో ఉన్నారు. సింగరేణి అధికారులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను సందర్శించినప్పుడు హర్షం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ఎదుట భారత రాష్ట్ర సమితి జెండాలను ఏర్పాటు చేశారు..కానీ తీరా ఇప్పుడు బిడ్ దాఖలు చేసే సమయానికి సింగరేణి రాకపోవడంతో ఆందోళనలో కూరుకుపోయారు. మరోవైపు సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ బిడ్ దాఖలు చేశారు.. అంతకు ముందే ఆయన కెసిఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఆయన మంచి పని చేశారని పొగిడారు. తీరా ఇప్పుడేమో బిడ్ దాఖలుకు రాకపోవడంతో ఆయన కూడా ఒకింత నిరాశలో ఉన్నారు. మరి చివరి నిమిషంలో కేసీఆర్ ఏమైనా ట్విస్ట్ ఇస్తారా అని కార్మికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.