TV9 vs Vishwak Sen:  విశ్వక్ సేన్ వర్సెస్ టీవీ9.. ట్రోలింగ్ వీడియోలతో పండుగ చేసుకుంటున్న నెటిజన్లు

TV9 vs Vishwak Sen: టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ తన సినిమా పబ్లిసిటీ కోసం చేసిన ఒక ఫ్రాంక్ వీడియో గాడితప్పి అభాసుపాలైంది. నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకున్న అభిమానిని కాపాడడానికి విశ్వక్ సేన్ చేసిన ఒక ఫ్రాంక్ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై ఒక లాయర్ హెచ్.ఆర్.సీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఇది మరింత వివాదాస్పదమైంది. విశ్వక్ సేన్ సినిమా ప్రమోషన్ కోసం చేసిన ఈ ఫ్రాంక్ వీడియోపై విమర్శలు చెలరేగాయి. ఈ క్రమంలోనే […]

Written By: NARESH, Updated On : May 5, 2022 2:57 pm
Follow us on

TV9 vs Vishwak Sen: టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ తన సినిమా పబ్లిసిటీ కోసం చేసిన ఒక ఫ్రాంక్ వీడియో గాడితప్పి అభాసుపాలైంది. నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకున్న అభిమానిని కాపాడడానికి విశ్వక్ సేన్ చేసిన ఒక ఫ్రాంక్ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై ఒక లాయర్ హెచ్.ఆర్.సీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఇది మరింత వివాదాస్పదమైంది. విశ్వక్ సేన్ సినిమా ప్రమోషన్ కోసం చేసిన ఈ ఫ్రాంక్ వీడియోపై విమర్శలు చెలరేగాయి.

ఈ క్రమంలోనే విశ్వక్ సేన్ ఫ్రాంక్ వీడియోపై టీవీ9 డిబేట్ పెట్టింది. న్యూస్ రీడర్ దేవి నాగవల్లి దీనిపై చర్చ పెట్టి విశ్వక్ సేన్ ను ‘పాగల్ సేన్’, ‘డిప్రెషన్ పర్సన్’ అంటూ వ్యక్తిగతంగా దూషించింది. చర్చ చూసిన హీరో విశ్వక్ సేన్ నేరుగా టీవీ9 స్టూడియోకు వచ్చారు. లోపలికి వెళ్లి న్యూస్ రీడర్ దేవీ నాగవెళ్లికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. ‘సరిగా మాట్లాడండి.. వ్యక్తిగతంగా దూషించడం ఏంటి? పాగల్ సేన్.. డిప్రెషన్ పర్సన్ అని తిడుతారా?’ అంటూ కాస్త గట్టిగానే విశ్వక్ సేన్ నిలదీశాడు. కొన్ని బూతులు ప్రయోగించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు విశ్వక్ సేన్ కు మద్దతుగా మాట్లాడుతుండగా.. మరికొందరు ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

స్టూడియోలో విశ్వక్ సేన్ కు సూక్తులు చెప్పిన టీవీ9 యాంకర్ దేవీ నాగవల్లి సుద్దపూస ఏం కాదంటూ కొందరు నెటిజన్లు ఆమె పాత వీడియోలు తీసి కడిగేస్తున్నారు. ఆమె టీవీ9 మైక్ పట్టుకొని గతంలో నడిరోడ్డుపై చిందులేసిన వీడియోలను బయటకు తీసి కడిగేస్తున్నారు. విశ్వక్ సేన్ నడిరోడ్డుపై ఫ్రాంక్ వీడియో తీస్తే గెట్ అవుట్ అన్న దేవి నాగవెళ్లి గతంలో ఇదే పని చేసిందంటూ వీడియోలతో విరుచుకుపడుతున్నారు. ‘రోడ్లు మీద ఆ గోల ఏంటి అన్నావా… మరి నువ్వు చేసింది  ఏంది అక్కయ్…’అంటూ దేవీని నిలదీస్తున్నారు.

ఈ వివాదం వైరల్ కావడంతో టీవీ9 తీరుపై నెటిజన్లు రెచ్చిపోయారు.. విశ్వక్ సేన్ కు మద్దతుగా చాలా మంది ట్రోలర్స్, మీమ్స్ పోటెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు టీవీ9కు వ్యతిరేకంగా.. విశ్వక్ సేన్ కు మద్దతుగా పలు ట్రోలింగ్ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.

ఇక కొందరు మాత్రం విశ్వక్ సేన్ వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా ఈ వివాదాన్ని మాత్రం నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఈ టీవీ9 వర్సెస్ విశ్వక్ సేన్ లొల్లినే కనిపిస్తోంది. దీని వల్ల విశ్వక్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మూవీకి ఫుల్ ప్రమోషన్ వచ్చేసింది. విశ్వక్ ఏమనుకొని ఈ వీడియో చేశాడో కానీ అది పెంటపెంట అయ్యి చివరకు ఆయన సినిమాకే ఫుల్ హైప్ తెచ్చిపెట్టింది.