Das Ka Dhamki Pre Release : యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించి స్వయంగా దర్శకత్వం వహించిన మూవీ ‘దస్ కా దమ్కీ’. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జూ.ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ సినిమా పిచ్చిని.. ఫ్యాషన్ ను ఎన్టీఆర్ ఈ వేడుకలో బయటపెట్టాడు.
విశ్వక్ సేన్ స్వయంగా నటించి దర్శకత్వం వహించిన ‘దస్ కా దమ్కీ’ మార్చి 22న రిలీజ్ కాబోతోంది. ఈ ఉగాదికి సినిమా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు హాజరు కావాల్సిందిగా విశ్వక్ స్వయంగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించాడు. మంచి భోజనం పెట్టి కారులో వెళ్లబోతు ఎన్టీఆర్ తో విశ్వక్ ఓ మాట అన్నాడట.. ఆ మాటను ఎన్టీఆర్ వేదికపై చెప్పి ఎమోషనల్ అయ్యాడు.
విశ్వక్ హీరోగా, దర్శకత్వం వహించిన ‘దస్ కా దమ్కీ’ మూవీ తన ఇల్లు, ఆస్తులు అంతా అమ్మి మరీ తీశాడట.. ఈ సినిమా ఆడకపోతే తాను రోడ్డున పడుతానని.. అందుకే ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు రావాలంటూ తనను కోరాడని ఎన్టీఆర్ తెలిపాడు. తాను ఆ మాట అన్నప్పుడు తనకు కన్నీళ్లు వచ్చాయని.. సినిమా అంటే ఇంత పిచ్చి పనికిరాదని.. నువ్వు ఇక ఈ సినిమాతో దర్శకత్వం ఆపేసి కొత్తవారికి ఛాన్స్ ఇవ్వు అంటూ వేదికపై విశ్వక్ కు ఎన్టీఆర్ సలహా ఇచ్చాడు. కొత్త వారికి ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించాలని.. ఆస్కార్ స్థాయికి మన సినిమా వెళ్లిందని.. దాన్ని మరింత అందరం కలిసి నిలబెట్టాలని ఎన్టీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చాడు.