
India Today Conclave – Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తం మారుమోగిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కోసం గత కొద్దీ రోజుల నుండి అమెరికా లోనే ఉంటున్న రామ్ చరణ్ నేడు ఇండియా కి తిరిగి వచ్చాడు.ఇండియాకి తిరిగి వచ్చిన వెంటనే ఆయన మన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యాడు.ఆ తర్వాత ఆయన ఇండియన్ టుడే కాంక్లేవ్ మీటింగ్ లో పాల్గొన్నాడు.
అక్కడ కాసేపు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.అయితే రామ్ చరణ్ అమెరికా లో కొన్ని ప్రముఖ మీడియా చానెల్స్ తో ముచ్చటించినప్పుడు హాలీవుడ్ లోకి త్వరలోనే ఎంట్రీ ఇస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం చర్చల్లో ఉన్నట్టుగా, త్వరలోనే అది కార్యరూపం దాలుస్తుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.ఇప్పుడు ఇండియా టుడే కాంక్లేవ్ మీటింగ్ లో కూడా ఇదే ప్రస్తావన వచ్చింది.
అయితే ఈ హాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి రామ్ చరణ్ ఎలాంటి కామెంట్ కూడా చెయ్యలేదు.ప్రాసెస్ లో ఉంది, మంచి వార్త త్వరలోనే వినబోతున్నాము అంటూ చెప్పుకొచ్చాడు.అంతే కాకుండా తనకి హాలీవుడ్ లో టామ్ క్రూజ్ అంటే చాలా ఇష్టమని, ఒక్కసారైనా ఆయనని కలవాలని ఉందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.హాలీవుడ్ లో అవకాశం వస్తే టామ్ క్రూజ్ తో నటిస్తారా అని అడగగా అంత అదృష్టం వస్తే ఇంకేమి కావాలి అంటూ రామ్ చరణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.మీరు ‘టాప్ గన్ మావెరిక్’ రాజమౌళి తో కలిసి ఇండియన్ వెర్షన్ చెయ్యొచ్చు కదా అని రామ్ చరణ్ ని జర్నలిస్ట్ అడగగా మీరు చెప్పేవి నిజం అవుతుంటాయని అందరూ అంటూ ఉంటారు, ఇది కూడా నిజం కావాలని కొట్టుకుంటున్నాను అంటూ రామ్ చరణ్ ఈ సందర్భంగా తెలిపాడు.