
Vishvak Sen- Balakrishna: నందమూరి బాలకృష్ణ మల్టీఫుల్ పర్సనాలిటీ అని నిరూపించుకుంటున్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా, టీవీ ప్రోగ్రామ్ హోస్ట్ గా తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. ఈమధ్య ఓ జువెల్లరీ షోరూంకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి అడ్వర్టయిజ్ చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. ఈ తరుణంలో బాలక్యకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా నటుడు విశ్వక్ సేన్ బాలయ్య వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా బాలయ్య కాళ్లపై పడ్డాడు. అలాగే విశ్వక్ సేన్ తో ఉన్న మహేశ్ అచంట కూడా అదే పనిచేశారు. దీంతో బాలయ్య చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు.
ఎమ్మెల్యే కోటాలో టీడీపీ ఎమ్మెల్సీగా అనురాధ ఇటీవల విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమెకు టీడీపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజకీయ నాయకులే కాకుండా కొందరు సినీ పరిశ్రమకు చెందిన వారు సైతం ఆమెను అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ హోటల్ లో ఆమె ఉన్నారన్న విషయం తెలుసుకొని విషెష్ చెప్పేందుకు విశ్వక్ సేన్, మహేశ్ అచంట అక్కడికి వెళ్లారు. అక్కడే బాలయ్య ఉండడంతో బాలయ్యపై కెమెరాలు తిప్పాయి.

విశ్వక్ సేన్ అక్కడికి చేరుకోగానే ముందుగా బాలయ్య కాళ్లపై పడ్డారు. వెంటనే అతడిని బాలయ్య పైకి లేపారు. అయితే మహేశ్ అచంట కూడా బాలకృష్ణ కాళ్లపై పడిపోయేందుకు ట్రై చేశారు. మొదటిసారి సాధ్యం కాకపోవడంతో రెండోసారి అదే పనిచేయడానికి సిద్ధమయ్యాడు. కానీ బాలయ్య అందుకు ఒప్పుకోలేదు. వెంటనే ‘అలా చేయొద్దు.. కాళ్లు మొక్కడం ఏమైనా పెద్ద పనా?’ అన్నట్లు మహేశ్ ను చూస్తూ మాట్లాడారు. దీంతో అక్కడున్న ఎమ్మెల్సీతో పాటు ఇతర టీడీపీ నాయకులు షాక్ అయ్యారు.
ఆ తరువాత బాలకృష్ణ కాసేపు ఆగి విశ్వక్ సేన్, మహేష్ ఆచంటను అనురాధకు పరిచయం చేశారు. మిగతా వారు వారు కూడా పరిచయం చేసుకున్నారు. మహేష్ నటించిన ‘దాస్ ఖా దమ్కీ’ ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కోసం విశ్వక్ సేన్ బాలకృష్ణను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య తనదైన డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాలయ్య ఆశీర్వాదంతోనే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుందని విశ్వక్ సేన్ ఓ సందర్భంలో చెప్పారు. దీంతో థ్యాంక్స్ చెప్పే క్రమంలో బాలయ్య కాళ్లపై పడ్డారన్న చర్చ సాగుతోంది.
