
Virupaksha Trailer Review: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విరూపాక్ష’.ఆయనకీ బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత చేసిన మొట్టమొదటి చిత్రం ఇది. గ్లిమ్స్ వీడియో దగ్గర నుండే ఈ చిత్రం ఆడియన్స్ దృష్టిని ఎంతగానో ఆకర్షించింది.పాన్ ఇండియా లెవెల్ సాయి తేజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రం లో నటించాడు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ మరియు స్క్రీన్ ప్లే అందించగా,నూతన దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు.
వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ నెల 21 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని నేడు విడుదల చేసారు, ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఒక్క మాటలో ట్రైలర్ ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ నుండి మరో ‘కార్తికేయ 2 ‘ లాంటి హిట్ రాబోతుంది.సాయి తేజ్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో స్క్రిప్ట్ సెలెక్షన్స్ అన్నీ ఆయనని వేరే లెవెల్ కి తీసుకెళ్లే విధంగానే ఉంటున్నాయి. ఒక పల్లెటూరు మొత్తం మూఢ నమ్మకాలతో నిండిపోయి ఉంటుంది, దానిని హీరో ఎలా ఛేదించాడు అనేదే స్టోరీ.
ఈ ట్రైలర్ లో సాయి తేజ్ మార్క్ కి తగ్గ ఎంటర్టైన్మెంట్ మరియు హీరోయిన్ సంయుక్త మీనన్ తో లవ్ ట్రాక్ చూపించేసారు.కేవలం రెండు నిమిషాల్లోనే సినిమా ఎలా ఉంటుందో అర్థం అయిపోయింది. ఈ ట్రైలర్ ని చూసినప్పుడు ప్రతీ ఒక్కరికి అనిపించింది ఏమిటంటే ‘ఇంత తక్కువ బడ్జెట్ తో అద్భుతమైన క్వాలిటీ ని మైంటైన్ చేసారు’ అని.ట్రైలర్ లాగానే సినిమా కూడా అదిరిపోతుందా లేదా అనేది మరో పది రోజుల్లో తెలియనుంది.
