Virupaksha Collections: మొదటి రోజుకంటే 2వ రోజు ఎక్కువ వసూళ్లు..బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర తిరగరాస్తున్న ‘విరూపాక్ష’

Virupaksha Collections: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై, బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకొని, బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ ఓపెనింగ్ ని దక్కించుకుంది. బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా ఇది. నరకం చూసిన రోజుల నుండి, నేడు ఇండస్ట్రీ షేక్ అయ్యే రేంజ్ బ్లాక్ బస్టర్ ని కొట్టినందుకు మెగా అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ఈ సినిమాకి […]

Written By: Vicky, Updated On : April 22, 2023 2:04 pm
Follow us on

Virupaksha Collections

Virupaksha Collections: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై, బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకొని, బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ ఓపెనింగ్ ని దక్కించుకుంది. బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా ఇది. నరకం చూసిన రోజుల నుండి, నేడు ఇండస్ట్రీ షేక్ అయ్యే రేంజ్ బ్లాక్ బస్టర్ ని కొట్టినందుకు మెగా అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.

ఈ సినిమాకి టాక్ ఏ రేంజ్ వచ్చిందంటే, సినిమా చూసిన ప్రతీ ఒక్కరు ‘ఒక అరుంధతి..ఒక చంద్ర ముఖి..ఒక వీరు పాక్ష’ రేంజ్ లో చెప్తున్నారు.అంత థ్రిల్లింగ్ కి గురి చేసిందట ఈ చిత్రం.మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 6 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.విన్నర్ చిత్రం తర్వాత సాయి ధరమ్ తేజ్ కి మళ్ళీ అలాంటి ఓపెనింగ్ దక్కింది ఈ సినిమాతోనే.

ఇక రెండవ రోజు రంజాన్ పర్వదినం అవ్వడం తో ఈ చిత్రానికి మార్నింగ్ షోస్ నుండి మొదటి రోజు కంటే ఎక్కువ ఆక్యుపెన్సీలు నమోదు అవ్వడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక మ్యాట్నీ షోస్ నుండి వేరే లెవెల్ ఆక్యుపెన్సీలు ఉంటాయని, అదనపు షోస్, అదనపు థియేటర్స్ కి కూడా యాడ్ అవుతాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

Virupaksha Collections

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టీ చూస్తే, ఈ సినిమా రెండవ రోజు 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట.అంటే మొదటి రోజు వరల్డ్ వైడ్ వచ్చిన వసూళ్లను, ఈ చిత్రం రెండవ రోజు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే రాబట్టబోతుంది అన్నమాట.ఇలాంటి అద్భుతాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి.ఊపు చూస్తూ ఉంటే సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటే ఛాన్స్ ఉందని చెప్తున్నారు.