Virupaksha Collections: ‘విరూపాక్ష’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మొదటి రోజు ఎంత వసూళ్లు రాబట్టబోతుందో తెలుసా!

Virupaksha Collections: సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. విడుదలకు ముందు నుండే ఈ చిత్రం పెద్ద సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్ లోను మరియు బయ్యర్స్ లోని ఉండేది. ఎందుకంటే టీజర్ మరియు ట్రైలర్ ఆ రేంజ్ లో ఉంది కాబట్టి. ప్రేక్షకులు కూడా ఎప్పటి నుండో ఒక అదిరిపొయ్యే హారర్ థ్రిల్లర్ ని చూడాలని […]

Written By: Vicky, Updated On : April 21, 2023 1:45 pm
Follow us on

Virupaksha Collections

Virupaksha Collections: సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. విడుదలకు ముందు నుండే ఈ చిత్రం పెద్ద సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్ లోను మరియు బయ్యర్స్ లోని ఉండేది. ఎందుకంటే టీజర్ మరియు ట్రైలర్ ఆ రేంజ్ లో ఉంది కాబట్టి. ప్రేక్షకులు కూడా ఎప్పటి నుండో ఒక అదిరిపొయ్యే హారర్ థ్రిల్లర్ ని చూడాలని అనుకుంటూ ఉన్నారు.

సరిగ్గా వాళ్లకి అభిరుచికి తగ్గట్టుగానే అంచనాలను మించి ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు ఒక గొప్ప థ్రిల్లర్ మూవీ ని చూసిన అనుభూతితో బయటకి వస్తున్నారు. టాక్ బాగా రావడం తో ఓపెనింగ్స్ కూడా అన్ని సెంటర్స్ లో దుమ్ము లేపేసింది. ప్రారంభ షోస్ డీసెంట్ గా అనిపించినప్పటికీ, మాట్నీ షోస్ నుండి విజృంభించేసింది.

Virupaksha Collections

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని చూస్తూ ఉంటే ఈ చిత్రం కేవలం నైజాం ప్రాంతం నుండే నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టే అవకాశం ఉందట.ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు, మార్నింగ్ షోస్ యావరేజి గా ఉన్నప్పటికీ మ్యాట్నీస్ నుండి సింగల్ స్క్రీన్స్ మరియు మల్టీప్లెక్స్ షోస్ నుండి అద్భుతమైన గ్రాస్ వసూళ్లు వచ్చిందట.ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి.సీడెడ్ , ఉత్తరాంధ్ర, గుంటూరు, కృష్ణ జిల్లాలలో అద్భుతమైన ట్రెండింగ్ ఉంది.మొత్తం మీద కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమా 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాదిస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇక అమెరికా లో కూడా ప్రీమియర్ షోస్ నుండి మంచి గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది ఈ చిత్రం, అక్కడ కేవలం ప్రీమియర్స్ నుండే లక్ష డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది అట.ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ అట.అలా ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి ఈ సినిమా 7 కోట్ల రూపాయిల షేర్ ని మొదటి రోజు రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.