
Virupaksha First Day Collections: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘విరూపాక్ష’ నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై మొదటి ఆట నుండే సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో ఇలా మొదటి ఆట నుండే అద్భుతమైన టాక్ తెచ్చుకున్న సినిమానే లేదు.’ప్రతి రోజు పండగే’ చిత్రానికి కూడా డివైడ్ టాక్ వచ్చింది.కానీ రెండవ రోజు నుండి ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా నచ్చడం తో పెద్ద హిట్ అయ్యింది.
ఇక ‘విరూపాక్ష’ చిత్రం విషయానికి వస్తే మొదటి నుండి ఈ సినిమా పై ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి.టీజర్ మరియు ట్రైలర్ అద్భుతంగా క్లిక్ అయ్యింది.ఒక గొప్ప హారర్ సినిమాని చూడబోతున్నాము అనే అనుభూతిని కలిగించింది.ఇక ఆ తర్వాత సినిమా విడుదలైన తర్వాత ఆ అంచనాలను మ్యాచ్ చెయ్యడం తో, ఓపెనింగ్స్ అదిరిపోయాయి.మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
మార్నింగ్ షోస్ యావరేజి గానే ప్రారంభం అయ్యినప్పటికీ, మాట్నీస్ నుండి అన్నీ ప్రాంతాలలో సినిమా బాగా పికప్ అయ్యింది.సాయంత్రం షోస్ మరియు సెకండ్ షోస్ అయితే థియేటర్స్ మొత్తం కిక్కిరిసిపోయాయి.మల్టీప్లెక్సులలో అదనపు షోస్ కూడా యాడ్ చేసారు.అలా మొదటి రోజు రెండు రేలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రం 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది సమాచారం.మరో పక్క ఈ సినిమాకి ఓవర్సీస్ లో కూడా అదిరిపొయ్యే రేంజ్ వసూళ్లు వచ్చాయి.

అక్కడి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం కేవలం ప్రీమియర్ షోస్ నుండే లక్షకి పైగా డాలర్స్ ని వసూలు చేసింది.ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాస్ గా చెప్పుకోవచ్చు.అలా ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి ఈ సినిమా సుమారుగా 7 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిందట.ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 22 కోట్ల రూపాయలకు జరిగింది.మొదటి వారం లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.