
Smriti Mandhana- Virat Kohli: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం కి టీమిండియా కెప్టెన్లు కలిసి రావడం లేదు.. ఈ ప్రాచైజీ పురుషుల జట్టుకు ఒకప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉండేవాడు.. కానీ ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించలేకపోయాడు.. భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం కెప్టెన్ గా మాత్రం విఫలమయ్యాడు.. ఇక విరాట్ కోహ్లీ విఫలమైన నేపథ్యంలో గత సీజన్ నుంచి దక్షిణాఫ్రికా ఆటగాడు డు ప్లేసిస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అయినప్పటికీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం ఘనమైన విజయాలు సాధించడం లేదు.
ఇక ఈ ఏడాది ప్రారంభమైన మహిళల ప్రీమియర్ టి20 లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం ఇండియన్ కెప్టెన్ స్మృతి మందాన ను కెప్టెన్ గా నియమించుకుంది. ఇందుకు వేలంలో అత్యధిక ధర చెల్లించింది. 50 లక్షల బేస్ ధర ఉన్న స్మృతికి ఏకంగా మూడు కోట్ల పైచిలుకు ధర పెట్టి కొనుగోలు చేసింది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటివరకు బెంగళూరు టీం రెండు మ్యాచ్లు ఆడింది. రెండింటిలోనూ ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్ ల్లో స్మృతి చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. కెప్టెన్ గా కూడా రాణించలేకపోతోంది.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 60 పరుగుల తేడాతో, ముంబై తో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో బెంగళూరు పరాజయాలను మూటగట్టుకుంది.

మొన్నటిదాకా ఇండియన్ టీంకు కెప్టెన్గా వ్యవహరించిన వారు ఐపీఎల్లో రాణించలేరు అనే అపప్రద ఉండేది. స్మృతి విషయంలోనూ అది నిజమైంది. ఇతర మ్యాచుల్లో దీటుగా ఆడే వారు… ఐపీఎల్ ప్రీమియర్ కు వచ్చేసరికి విఫలమవుతున్నారు.. పురుషుల జట్టులో విరాట్ కోహ్లీ, మహిళల జట్టులో స్మృతి..ఇలా ఆ అపప్రదను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక మహిళల ప్రీమియర్ లీగ్ విషయానికొస్తే రెండు ఓటములకు సంబంధించి స్మృతి విలేకరులతో మాట్లాడుతూ.. బ్యాటర్ల వైఫల్యం వల్లే ఓడిపోయామని చెప్పింది. కానీ బెంగళూరు ఓటమికి బ్యాటర్ల వైఫల్యమే కాదు… బౌలర్ల లోపం, ఫీల్డింగ్లో నిర్లక్ష్యం, సరైన సమయాల్లో నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా కారణాలే. కానీ వీటిని దాచిపెట్టి బ్యాటర్ల వైఫల్యమే అని స్మృతి చెప్పడం విశేషం.. అయితే వచ్చే మ్యాచ్ల్లో మా తడాఖా చూపిస్తామని స్మృతి అంటుంది. అదే నిజం చేస్తే గనుక బెంగళూరు జట్టుపై ఉన్న కెప్టెన్ అపప్రద తొలగిపోతుంది.