వైరల్: రష్మికకు లవ్ ప్రపోజ్ చేసిన విజయ్

టాలీవుడ్ పై ఇప్పుడు అందరూ కోరుకునే ప్రేమ జంట ఏదయ్యా అంటే ఠక్కున సమాధానం చెప్పేస్తారు. వారే ఇంకా పెళ్లి కాని ‘విజయ్ దేవరకొండ-రష్మిక’ జంటనే. తెలుగులో స్టార్ హీరోలందరికీ పెళ్లిళ్లు అయ్యి పిల్లలు ఉన్నారు. దీంతో గాసిప్పులు రాయడానికి వీల్లేదు. పెళ్లి కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మన విజయ దేవరకొండ మాత్రమే. అందుకే అతడి ప్రేమ.., హీరోయిన్లతో ఎఫైర్ పై పుంకానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ మామూలోడేం కాదు.. ఈ మధ్య […]

Written By: NARESH, Updated On : April 21, 2021 10:23 am
Follow us on

టాలీవుడ్ పై ఇప్పుడు అందరూ కోరుకునే ప్రేమ జంట ఏదయ్యా అంటే ఠక్కున సమాధానం చెప్పేస్తారు. వారే ఇంకా పెళ్లి కాని ‘విజయ్ దేవరకొండ-రష్మిక’ జంటనే. తెలుగులో స్టార్ హీరోలందరికీ పెళ్లిళ్లు అయ్యి పిల్లలు ఉన్నారు. దీంతో గాసిప్పులు రాయడానికి వీల్లేదు. పెళ్లి కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మన విజయ దేవరకొండ మాత్రమే. అందుకే అతడి ప్రేమ.., హీరోయిన్లతో ఎఫైర్ పై పుంకానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి.

విజయ్ దేవరకొండ మామూలోడేం కాదు.. ఈ మధ్య ముంబైలో షూటింగ్ చేసుకుంటున్న సమయంలో రష్మికను సీక్రెట్ గా కలవడంతో వీరిద్దరూ లవ్ లో ఉన్నారన్న ప్రచారం మళ్లీ మొదలైంది.

‘గీత గోవిందం’సినిమాతో విజయ్-రష్మిక హిట్ పెయిర్ గా టాలీవుడ్ లో మెరిసింది. ఈ సినిమా ఎంత విజయం సాధించిందో అంతే రేంజ్ లో ఇందులో నటించిన విజయ్ దేవరకొండ, రష్మికలకు పేరొచ్చింది. ఆ తరువాత ఇద్దరు వేరే వేరే అవకాశాలు తెచ్చుకొని ఫుల్ బిజీ అయ్యారు. అయితే ‘డియర్ కామ్రేడ్’ సినిమా ద్వారా మరోసారి ఈ జంట కలిసి వచ్చినా ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తే బాగుండునని కోరుకున్నారు. ఈ తరుణంలో వీరిద్దరు కలిసి మరోసారి కనిపించారు.

ప్రముఖ సబ్బు సంతూర్ యాడ్లో విజయ్, రష్మికలు కలిసి తాజాగా నటించారు. ఇందులో విజయ్ ఏకంగా రష్మికకు లవ్ ప్రపోజల్ చేస్తాడు. మొకాళ్లపై కూర్చొని రష్మికకు ఒక బహుమతిని ఇచ్చి తన లవ్ విషయం చెప్తాడన్నమాట. అయితే రియల్ లవర్స్ లాగే వీరు నటించడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాంటి ప్రమోషన్ లేకుండా సంతూర్ సోప్ కు అడ్వర్టయిజ్మెంట్ వచ్చినట్లు అయ్యింది.

విజయ్, రష్మికల మధ్య ఇప్పటికే ఏదో ఉందని అనుమానాలు ఉన్నాయి. దాన్ని మరింత పెంచేలా సంతూర్ సోప్ యాడ్ రూపొందించారు. ఈ యాడ్ ద్వారా వారి అభిమానుల కోరిక నెరవేరినట్లయింది. ఈ యాడ్ వీడియోను ఫ్యాన్స్ తెగ వైరల్ చేసేస్తున్నారు. కొందరు వీరిద్దరు రియల్ లవర్స్ లాగే ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు. ఏదీ ఏమైనా ఈ లవ్లీ కపుల్ మరోసారి యాడ్ లో కనిపించి హాట్ టాపిక్ గా మారింది.