Viral Video: ఈ సృష్టిలో అత్యంత సహనమైన మనిషి తల్లి. అత్యంత తెలివైన మనిషి కూడా ఆమె. అందుకే తన ఇంటిని చక్కబెట్టుకుంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చక్కదిద్దుకుంటుంది.. వంట నుంచి మొదలుపెడితే పిల్లల పెంపకం వరకు.. తల్లి చేయని పనులంటూ ఉండవు.. పోపుల డబ్బాలో దాచే డబ్బుల నుంచి పవిట కొంగు చివరి ముడిలో దాచే విబూది వరకు.. అమ్మకు తెలియని విద్యలంటూ లేవు. అందుకే అమ్మ అనంతం.. అనన్య సామాన్యం.. ఈ ప్రపంచంలో ఉన్న అమ్మలందరిలో.. భారతీయ అమ్మలు వేరు. ఎందుకంటే వారికి ఉన్న తెలివి, పనిచేసే నేర్పు, ఇబ్బందులను ఎదుర్కొనే ఓర్పు చాలా భిన్నంగా ఉంటుంది. ఏ దేశమేగినా సరే వారిలో ఏ మార్పు ఉండదు. పైగా అత్యవసర సమయాల్లో.. ఉన్న వాటినే అనుకూలంగా వాడుకోవడంలో భారతీయ అమ్మలను మించిన వారు మరొకరు లేరు.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. దుబాయ్ లో పామ్ హోటల్లో పల్లవి వెంకటేష్ అనే యువతి తన కుటుంబంతో దిగింది.. అది అత్యంత విలాసవంతమైన హోటల్. అక్కడికి కేవలం శ్రీమంతులు మాత్రమే వస్తారు. పల్లవి వెంకటేష్ తన కుటుంబంతో ఆ హోటల్ బాల్కనీ నుంచి దుబాయ్ అందాలను వీక్షిస్తున్నారు. అయితే అక్కడ రోజుల తరబడి ఉండటంతో.. విడిచిన దుస్తులను ఉతికిన తర్వాత ఎక్కడ ఆరవేసుకోవాలో తెలియలేదు. హోటల్ సిబ్బందిని అడిగితే ఏమనుకుంటారోననే భయం పల్లవి వెంకటేష్ మాతృమూర్తిని ఇబ్బంది పెట్టింది. దీంతో ఆమె ఉతికిన దుస్తులను అక్కడే బాల్కనీలో ఆరేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో హోటల్ సిబ్బంది హుటాహుటిన పల్లవి వెంకటేష్ కుటుంబం బస చేసిన గదిలోకి వెళ్లారు. అలా బాల్కనీలో దుస్తులు ఆరవేయడం సరికాదని పల్లవి వెంకటేష్ మాతృమూర్తికి సూచించారు.
ఈ వీడియోను పల్లవి వెంకటేష్ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది..”మేము దుబాయి లో విహారయాత్రకు వెళ్ళాం. ది ఫామ్ హోటల్లో బస చేసాం . మా అమ్మ దుస్తులను ఆరబెట్టడానికి హోటల్ బాల్కనీ ఉపయోగించింది.. దుస్తులను గార్డ్ రైలు పై ఆరబెట్టేందుకు జాగ్రత్తగా వేలాడదీస్తోంది.. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. భారతీయ అమ్మలు ఎలాంటి పనినైనా అత్యంత చాక చక్యంగా చేస్తారు..అందుకు నిదర్శనమే ఈ దృశ్యమని” పల్లవి వెంకటేష్ రాసుకొచ్చింది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను లక్షల మంది చూశారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More