Viral Video : ఎండ వేడికి తట్టుకోలేక ఆ ఇద్దరు యువకులు ఒకచోట ఆగారు. కాస్త సాంత్వన కోసం కూల్ డ్రింక్ తీసుకున్నారు. అందులో ఉన్న డ్రింక్ తాగుదామని మూత తీశారు. కానీ ఇంతలోనే వారికి ఒక షాకింగ్ పరిణామం ఎదురైంది. దీంతో ఆ దృశ్యాన్ని చూసి వారు తట్టుకోలేకపోయారు.. బతికిపోయామని అనుకున్నారు.. ఇంతకీ ఏం జరిగిందంటే.
Also Read : చెప్పిన వినకుండా కూల్ డ్రింక్స్ తాగుతున్నారుగా.. అవి తాగడం వల్ల 3.4లక్షల మంది చనిపోయారట ?
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ ప్రాంతంలో ఓ యువకులు పని మీద బయటకు వెళ్లారు. ఎండలో ప్రయాణం చేయడంతో కాస్త అలసటకు గురయ్యారు. శరీర బడలిక తీర్చుకోవడానికి వారు అక్కడే ఉన్న హోటల్ వద్ద ఆగారు. అక్కడ ఒక కూల్ డ్రింక్ కొనుగోలు చేశారు.. ఆ తర్వాత దానిని తాగుదామని మూత ఓపెన్ చేశారు. మూత ఓపెన్ చేయగానే వారికి షాకింగ్ పరిణామం ఎదురైంది. మూత ఓపెన్ చేయగానే అందులో బల్లి కాలు కనిపించింది. ఇంతవరకు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమకు కూల్ డ్రింక్ విక్రయించిన హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు ఆ కూల్ డ్రింక్ తాగిన ఓ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.. అయితే ఆ యువకులు ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు..” మేము పనిమీద బయటకు వెళ్లి వచ్చాం. ఎండ కావడంతో అలసటకు గురయ్యాం. ఈ క్రమంలో శరీర బడలిక తీర్చుకోడానికి ఓ హోటల్ వద్ద ఆగాం. అక్కడ కూల్ డ్రింక్ కొనుగోలు చేశాం. అది ఓపెన్ చేసి నా మిత్రుడు కూల్ డ్రింక్ తాగాడు. దీంతో వెంటనే అతడు అస్వస్థకు గురయ్యాడు. జాగ్రత్తగా గమనిస్తే అందులో బల్లి కాలు కనిపించింది. భయపడి వెంటనే హోటల్ నిర్వాహకులను నిలదీశాం. వారి వద్ద నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడం మీకు ఫిర్యాదు చేస్తున్నామని” ఫుడ్ సేఫ్టీ అధికారులకు చేసిన ఫిర్యాదులో ఆ యువకులు పేర్కొన్నారు. అయితే ఆ కూల్ డ్రింక్ లో బల్లి కాలు కనిపించడంతో స్థానికులు హతుశులవుతున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో కూల్ డ్రింక్స్ తయారు చేస్తున్నారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ” కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరమైనప్పటికీ చాలామంది తాగుతున్నారు. కూల్ డ్రింక్స్ తయారయ్యే చోట వాతావరణం ఇలా ఉంటున్నది. అందులో బల్లి కాళ్లు.. ఇతర వ్యర్ధాలు కనిపించాయంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందువల్ల కూల్ డ్రింక్స్ తాగకపోవడమే మంచిది. వ్యర్ధాలు ఉన్న కూల్ డ్రింక్స్ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకునే దానికంటే.. సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండటమే ఉత్తమం అని” వైద్యులు సూచిస్తున్నారు.
Also Read : కూల్ డ్రింక్ బాటిల్స్ లో అసలు వెలితి ఎందుకు ఉంటుంది? దీనికి కారణం ఏంటి?