Viral Video: పెళ్లి అనేది ఒక పెద్ద కార్యక్రమం పెళ్లి చూపుల దగ్గర నుంచి వివాహం అనంతరం కార్యక్రమాల వరకు రెండు కుటుంబాల మధ్య జరిగే వేడుక. పెళ్లి అనగానే ముందు వధూవరుల అంగీకారం కావాల్సి ఉంటుంది. వధూవరులు ఒకరికి ఒకరు నచ్చితేనే పెళ్లి చేసుకుంటారు. పెద్దలు పెళ్లి జరిపిస్తారు. అందుకే పెళ్లికి ముందే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడ వధూవరులు ఒకిర ఫొటోలు ఒకరు చూసుకుని పెళ్లికి ఒకే చెప్పారు. ఇంకేముందు పెద్దలు నిశ్చితార్థానికి ఏర్పాటు చేశారు.
ఇంత క్యూట్‌గా..
ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం కోసం బంధువులంతా వచ్చారు. కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. దీంతో వధువు ఇంటికి వరుడు, అతని బంధువులు వచ్చారు. ఇల్లంతా సందడిగా మారింది. ఈ క్రమంలో తొలిసారి వధూవరులు చూసుకునే సమయం వచ్చింది. ఇద్దరూ ఒకరిని ఒకరు మొదటిసారి చూసుకుని ముసిముసిగా నవ్వుకున్నారు. ఇంతలో ఆ యువతి అందరి ముందే ఎవరూ ఊహించని విధంగా, ఎంతో క్యూట్‌గా యువకుడి వంటక ఓరగంటగా చూస్తూ.. రొమాంటిక్‌గా కిస్ ఇచ్చి కన్ను కొట్టింది. దీంతో ఆ యువకుడు షాక్ అవడమే కాకుండా సిగ్గుతో తనలోతాను ముసిముసిగా నవ్వుకున్నాడు.
సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ..
ఇక బంధువులంతా ఎంగేజ్‌మెంట్ కార్యక్రమంలో బిజీగా ఉండగా జరిగిన ఈ రొమాంటిక్ సీన్ అందరూ చూశారు. కానీ చూడనట్లుగా చూపులు పక్కకు తిప్పుకున్నారు. అందులో ఒకరు మాత్రం ఈ రొమాంటిక్ దృశ్యాన్ని ఎవరికీ అనుమానం రాకుండా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. దానికి తర్వాత సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయండంతో…
నెట్టింట్లో వైరల్..
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎంతో క్యూట్‌గా, రొమాంటిక్‌గా ఉన్న ఈ వీడియో చూసి నెటిజన్లు లైక్ కొడుతున్నారు. తక్కువ సమయంలోనే 3 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. 20 లక్షల మంది లైక్ చేశారు. ఇక కొందరు నెటిజన్లు ఇదేంపని అమ్మాయి అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అమ్మాయి బలే కన్నుకొట్టింది అంటూ కామెంట్ చేస్తున్నారు. గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం జాగ్రత్తగా దాచుకోండి అని కొందరు ఆ జంటకు సూచిస్తున్నారు. సూపర్.. ఈ జన్మకు ఇది జాలు అన్నట్లుగా ఉంది అని ఇంకొందరు కామెంట్ చేశారు. అయితే ఈ సీన్ ఎక్కడ జరిగింది అనేది మాత్రం తెలియదు.