Viral Video: వర్షాకాలంలో వర్షాలు కురుస్తాయి. శీతాకాలంలో చలిగాలులు వీస్తాయి. వేసవికాలంలో చెట్లన్నీ ఆకులను రాల్చుతాయి. ఇంతటి వైవిధ్యం గల ప్రకృతి ఎంతటి గొప్పది. తనను ఆధారంగా చేసుకుని మనుషుల కోసం ఎన్నో ఇస్తోంది. పీల్చేగాలి, తాగే నీరు, తినే తిండి, ఉండే ఆవాసం, కట్టుకునే వస్త్రం.. ఇలా సమస్తం ప్రకృతి ప్రసాదించిన వరాలే. కాకపోతే మనిషికి అత్యాశ ఎక్కువ కాబట్టి ప్రకృతిని జయించాలని చూస్తాడు. ప్రకృతిని జయించానని ఆనంద పడుతుంటాడు. కానీ ఆ ప్రకృతి కన్నీరు కానీ ఆ ప్రకృతి కన్నెర్ర చేస్తే తట్టుకోలేడు.. మనిషి ఎన్ని రకాల విధ్వంసాలకు పాల్పడినా.. ప్రకృతి ఇస్తూనే ఉంటుంది. మనిషి ఎదుగుదలకు తోడ్పడుతూనే ఉంటుంది. అతడి జీవితాన్ని సుఖవంతం చేస్తూనే ఉంటుంది. అలాంటి దృశ్యాన్ని ఓ వీడియో రూపంలో ఔత్సాహిక నెటిజన్ ఇన్ స్టా గ్రామ్ లో పంచుకున్నాడు. ఇది చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంది. అభివృద్ధి మోజులో పడుతున్న మనిషికి ఎన్నో విలువైన పాఠాలు చెబుతోంది.
కేరళ రాష్ట్రంలోని అళప్పుజ లోని శివారు ప్రాంతంలో ఓ వ్యక్తి విడిది గృహం నిర్మించుకున్నాడు. చుట్టూ పచ్చని పొలాలతో అది చూసేందుకు ఎంతో రమ్యంగా కనిపిస్తోంది. వర్షాకాలంలో ఆ విడిది గృహం చుట్టు నీళ్లు ఉంటాయి. అప్పుడు ఆ ప్రాంతం చూసేందుకు ఒక వెనిస్ నగరం లాగా కనిపిస్తుంది. మూడు నెలల వ్యవధి తర్వాత మళ్లీ ఆ ప్రాంతం పచ్చని పొలాలతో కోనసీమ లాగా కనువిందు చేస్తుంది.. మరో నాలుగు విరామం తర్వాత ఆ పంట మొత్తం కోతకు వస్తుంది. అప్పుడు ఆ ప్రాంతం పశువులకు ఆవాసంగా మారుతుంది.
ఇంతటి భిన్నమైన దృశ్యాలను ఒకే వీడియోలో ఆ నెటిజన్ పొందుపరిచాడు. 30 సెకండ్ల వ్యవధి ఉన్న ఈ వీడియో నెటిజన్ల ను ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే ఇది మిలియన్ వ్యూస్ నమోదు చేసింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అని కామెంట్లు చేస్తున్నారు. ప్రకృతి పరవశం అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు. ఈ వీడియో ద్వారా మనుషులకు ఆ నెటిజన్ ఎన్నో విలువైన గుణ పాఠాలు నేర్పారని కామెంట్ చేస్తున్నారు.