
అనసూయ.. ఓ అందమైన బుల్లితెర యాంకర్. అందం చందంలోనే కాదు.. చిలిపితనంలోనూ.. అల్లరి చేయడంలోనూ అనసూయను మించిన వారు లేరు. బుల్లితెరపై, వెండితెరపై వెలిగే ఈ ముద్దుగుమ్మ రంగస్థలం మూవీ తర్వాత సినిమాల్లోనూ మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటోంది.
అనసూయ బుల్లితెరపైనే కాదు.. వెండితెర మీద కూడా ప్రస్తుతం బిజీ అయ్యింది. సినిమాలతోపాటు ఐటెం సాంగ్ లో కనిపించే ఈ భామ ‘ఖిలాడి’ సినిమాలో మెయిన్ రోల్ లో కనిపించనుందట. హీరో రవితేజతో కలిసి ఇటలీ వెళ్లింది. ఆ తరువాత కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ సినిమాలోనూ ఈమెకు మెయిన్ రోల్ ఇచ్చారట.
తాజాగా అనసూయ ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటో షేర్ చేసి తానెక్కుడన్నానో చెప్పింది. అందులో అనసూయ అయితే కనిపించడం లేదు. అయితే తాను మాత్రం అందులోనే ఉన్నానంటోంది. ఈ సినిమాలో అనసూయ డీగ్లామర్ గా కనిపించనుందట.. ఇదే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది..
స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ నటిస్టున్న ‘పుష్ప’ సినిమా రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ లో తాజాగా అనసూయ పాల్గొంది. ఇందులో ఓ ముఖ్యపాత్రలో నటిస్తోంది. తాను షూటింగ్ వెళ్లానని అందుకు సంబంధించిన ఓ ఫొటో తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. పెట్టింది. అనసూయ, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలంలో కూడా నటించిన విషయం తెలిసిందే. తాజాగా పుష్ప లో కూడా ఆమె కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
అనసూయ పుష్పతో పాటు మరో రెండు సినిమాల్లో నటించనుంది. ‘థ్యాంక్యూ బ్రదర్’ అనే సినిమాతో పాటు కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చే ‘రంగమార్తాండ’ సినిమాలో నటించనుంది. ఈ సినిమాలో అనసూయ ప్రత్యేక పాత్రలో నటించనుంది. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే పాత్రలో మెరవనుంది.