Viral Monalisa : ఈ ఏడాది జనవరిలో జరిగిన మహా కుంభమేళా ఎంతో మందిని సెలబ్రిటీలను చేసింది. వారిలో అక్కడ పూసలు అమ్ముకుంటూ సోషల్ మీడియా కంట పడి వైరల్ అయిపోయింది మోనాలిసా. వైరల్ గర్ల్ మోనాలిసా (Viral Girl Monalisa) తన కొత్త రీల్‌తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇందులో ఒక మేకప్ ఆర్టిస్ట్ ఆమెకు అద్భుతమైన మేకోవర్ చేస్తూ కనిపించింది. నిజంగా మేకప్ ఆర్టిస్ట్ అద్భుతంగా పనిచేసింది. మోనాలిసా ట్రాన్స్‌ఫర్మేషన్ (Monalisa Makeover Video) చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. అంతేకాదు, ‘బాఘీ 3’ సినిమాలోని ‘డూ యూ లవ్ మీ’ పాట ఈ రీల్‌కు మరింత అందాన్నిచ్చింది. అభిమానులు ఆమె కొత్త లుక్‌పై తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో హార్ట్ ఎమోజీలతో నిండిపోయింది.
Also Read : నా దృష్టిలో ప్రభాస్ ఒక మామూలు నటుడు మాత్రమే : మంచు విష్ణు
ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన తర్వాత ఇండోర్‌కు సమీపంలోని మహేశ్వర్‌కు చెందిన మోనాలిసా సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటోంది. నిరంతరం కొత్త రీల్స్ చేస్తూ, వాటని అప్‌లోడ్ చేస్తూ తన అభిమానులతో బలమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుంది. ఆమె కొత్త లుక్స్ గురించి చర్చ జరగడం సహజమే.. ఎందుకంటే పెద్ద కళ్లతో ఉండే మోనాలిసా ప్రతి లుక్‌లోనూ కొత్త ఎట్రాక్షన్ కనబరుస్తోంది.
మొత్తానికి వైరల్ గర్ల్ న్యూ లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. జూనియర్ ఐశ్వర్య అంటూ కితాబిస్తున్నారు. @mona_lisa_0007 ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ చేసిన రీల్‌కు భారీగా లైక్‌లు, కామెంట్‌లు వస్తున్నాయి. ఒక యూజర్ “బ్యూటిఫుల్ మేకోవర్” అని కామెంట్ చేయగా, మరొక యూజర్ “సూపర్ యాక్ట్రెస్” అని అన్నారు.
కేవలం లుక్సే కాదు, మోనాలిసా నటనలో కూడా అద్భుతమైన మెరుగుదల కనిపిస్తోంది. రీల్ చూసిన కొంతమంది యూజర్లు “చూస్తుండగానే ఎంత మార్పు వచ్చింది” అని కామెంట్ చేశారు. ఇది వైరల్ గర్ల్ కృషి , అంకితభావాన్ని తెలియజేస్తుంది. అయితే, కొంతమంది యూజర్లు ఆమె ఇంకా నేర్చుకోవలసింది ఉందని అభిప్రాయపడుతున్నారు.