https://oktelugu.com/

Viral: దండలు మార్చుకుంటున్న వధూవరులు.. వధువు మాజీ ప్రేమికుడు వచ్చి ఏం చేశాడో చూడండి

Viral: ఈ కాలంలో చొక్కా మార్చినంత ఈజీగా ప్రేమికులను/ప్రియురాళ్లను మార్చేస్తున్నారు. సమాజం మారింది. యువత అభిరుచి కూడా పూర్తిగా మారిపోయింది. ప్రేమ అంటూ ఏదీ లేకుండా పోయింది. వ్యామోహంతో ప్రేమ అంటూ తిరుగుతున్నారు. ఆ తర్వాత బాగా ఆస్తిపాస్తులన్న వారిని చేసుకొని సెటిల్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఒక యువకుడిని ప్రేమించిన అమ్మాయి వేరే పెళ్లికి రెడీ అయ్యింది. పెళ్లి ఘనంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సడెన్ గా వధువు మాజీ ప్రేమికుడు ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2021 / 01:23 PM IST
    Follow us on

    Viral: ఈ కాలంలో చొక్కా మార్చినంత ఈజీగా ప్రేమికులను/ప్రియురాళ్లను మార్చేస్తున్నారు. సమాజం మారింది. యువత అభిరుచి కూడా పూర్తిగా మారిపోయింది. ప్రేమ అంటూ ఏదీ లేకుండా పోయింది. వ్యామోహంతో ప్రేమ అంటూ తిరుగుతున్నారు. ఆ తర్వాత బాగా ఆస్తిపాస్తులన్న వారిని చేసుకొని సెటిల్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఒక యువకుడిని ప్రేమించిన అమ్మాయి వేరే పెళ్లికి రెడీ అయ్యింది. పెళ్లి ఘనంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సడెన్ గా వధువు మాజీ ప్రేమికుడు ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు.

    UP Man Puts Sindoor on her Maang in Front of Groom on Wedding Day

    సినిమాను తలపించేలా జరిగిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో చోటుచేసుకుంది. నిజ జీవితంలోనూ ఇలాంటి ట్విస్ట్ చూసి పెళ్లికి వచ్చిన వారంతా షాక్ అయ్యారు.

    వివాహం మంటపంపై ఘనంగా జరుగుతోంది. వధూవరులు దండలు మార్చుకోవడానికి రెడీ అయ్యారు. ఇంతలో హఠాత్తుగా వధువు మాజీ ప్రేమికుడు వేదిక వద్దకు వచ్చాడు. సినిమాలోని హీరో స్టైల్లో ఆ ప్రేమికుడు వధువును పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. వివాహానికి వచ్చిన ఎవరో వీడియో తీస్తే ఇదిప్పుడు వైరల్ అవుతోంది.

    గోరఖ్ పూర్ లోని హర్ పూర్ లో బంధుమిత్రుల సమక్షంలో వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది. వేదికపై బంధువులు, వధూమరులు ఉన్నాడు. దండలు మార్చుకోవడానికి రెడీ అయిన జంటకు షాకిస్తూ ఒక యువకుడు కండువా కప్పుకొని వేదికపైకి సడెన్ గా ఎక్కాడు. వధువు నుదుటి మీద బొట్టును పెట్టాడు. వధువు తన ముఖాన్ని కప్పుకోవడానికి ప్రయత్నించింది. అయినా ఆ యువకుడు వధువు నుదుటి మీద బలవంతంగా సింధూరం దిద్దాడు.

    Also Read: కార్తీక్ కుటుంబం లో మనశ్శాంతి లేకుండా చేస్తున్న మోనిత.. ఆఖరికి ఆస్తులు కూడా!

    ఈ హఠాత్ పరిణామానికి పెళ్లికి వచ్చిన వారంతా షాక్ అయ్యారు. బంధువులు యువకుడిని అడ్డుకొని చితకబాదారు. పెళ్లి మండపానికి వచ్చిన యువకుడు వధువు మాజీ ప్రేమికుడని తెలిసింది. ఆ యువకుడు కొన్ని నెలల క్రితమే పని నిమిత్తం ఊరు బయటకు వెళ్లాడని తెలుస్తోంది. ఈ లోగా అమ్మాయి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లిని నిశ్చయించారు. పెళ్లి విషయం తెలుసుకున్న మాజీ ప్రేమికుడు తన ప్రేమను సినిమా స్టైల్ లో చూపించాలని పెళ్లిపందిరిలో హంగామా సృష్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

    Also Read: పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్.. అదిరిపోయిన పుష్ప ట్రైలర్..