https://oktelugu.com/

వైరల్: అల్లు అర్జున్ కూతురు ఏం చేస్తుందో చూశారా?

కరోనా కల్లోలంతో ఇప్పుడు సంవత్సరన్నరగా స్కూల్స్ తెరవడం లేదు. అంతా ఆన్ లైన్ చదువులే. దీంతో పిల్లలు స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ ట్యాప్స్ తో కుస్తీ పడుతున్నారు. అందులోనే ఆన్ లైన్ క్లాసులు వింటున్నారు. కోవిడ్ కేసులు తగ్గుతున్నా.. స్కూల్స్ యథావిధిగాకొనసాగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ స్కూల్స్ ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇక ఆన్ లైన్ పాఠాలకు పిల్లలు కూడా అలవాటు పడిపోయారు. ఇక స్టార్ హీరో, ఐకాన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 31, 2021 / 06:26 PM IST
    Follow us on

    కరోనా కల్లోలంతో ఇప్పుడు సంవత్సరన్నరగా స్కూల్స్ తెరవడం లేదు. అంతా ఆన్ లైన్ చదువులే. దీంతో పిల్లలు స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ ట్యాప్స్ తో కుస్తీ పడుతున్నారు. అందులోనే ఆన్ లైన్ క్లాసులు వింటున్నారు. కోవిడ్ కేసులు తగ్గుతున్నా.. స్కూల్స్ యథావిధిగాకొనసాగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ స్కూల్స్ ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇక ఆన్ లైన్ పాఠాలకు పిల్లలు కూడా అలవాటు పడిపోయారు.

    ఇక స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు కూడా ఆన్ లైన్ ద్వారానే చదువు కొనసాగిస్తున్నారు.ఇక క్లాసులు విన్నాక అల్లు అర్హ చేసే సందడి అంతా ఇంతాకాదు. సోషల్ మీడియాలో డైలాగ్స్ చెబుతూ.. ఆటలు ఆడుతూ.. అల్లరి చేస్తూ కనిపించే అల్లు అర్హ.. తాజాగా ఆన్ లైన్ క్లాసులలో బిజీగా ఉంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి షేర్ చేశారు. అదిప్పుడు వైరల్ గా మారింది. అల్లు ఫ్యాన్స్ దీన్ని తెగ షేర్లు చేస్తున్నారు.

    ఇక అల్లు అర్హ అప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా మారింది. వెండితెరపై కనిపించబోతోంది. అక్కినేని సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో అల్లు అర్హ కీలక పాత్రలో నటిస్తోంది.

    అల్లు అర్హ అల్లరి పిల్లగా బన్నీ ఇంట్లో సందడి చేస్తుంటారు. జుట్టు విరబోసుకొని బోసినవ్వులతో అర్హ చేసే అల్లరిని చాలా సార్లు అల్లు అర్జున్ షేర్ చేశాడు. కూతురుతో ఆడుకుంటున్న బన్నీ వీడియోలు వైరల్ అయ్యాయి.