నిజానికి గతంలోనే ‘రాజ్ కుంద్రా’ పై చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ బయటకు రావడంతో రాజ్ కుంద్రా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. తన పై నమోదు అవుతున్న కొత్త కేసులకు సమాధానాలు వివరణలు చెప్పలేక రాజ్ చేతులెత్తిసినట్టు తెలుస్తోంది. తాజాగా బీజేపీ నేత రామ్ కదం చేసిన కామెంట్స్ కూడా రాజ్ కుంద్రాను మరింతగా ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి.
బీజేపీ నేత రామ్ కదం మాట్లాడుతూ.. ‘రాజ్ కుంద్రా ఆన్ లైన్ గేమ్ పేరుతో దాదాపు రూ.3 వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడని ఆయన బలంగా ఆరోపించాడు. అయితే, ఈ సంపాదన వెనుక శిల్పా శెట్టిది చాల కీలక పాత్ర అని.. ఆమె సహకారం వల్లే అతను అక్రమ సంపాదనకు బాగా అలవాటు పడ్డాడని ఆయన విమర్శలు చేశారు.
కాగా సామాన్య జనాలను మోసం చేసి మూడు వేల కోట్ల రూపాయలను దోచుకున్న రాజ్ కుంద్రాను, అలాగే ఆయన సతీమణి ‘శిల్పా శెట్టి’ పై కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ‘శిల్పా శెట్టి’కి ఉన్న స్టార్ డమ్ ను, రాజ్ కుంద్రా తన బిజినెస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వాడుకున్నాడట. కేవలం ‘శిల్పా శెట్టి’ అంబాసిడర్ అవ్వడం వల్ల ఆ గేమ్ ను జనాలు విపరీతంగా ఆడి మోసపోయారు అని బీజేపీ నేత రామ్ కదం ఆరోపణలు చేశారు.