
Vinaro Bhagyamu Vishnu Katha Collection: కిరణ్ అబ్బవరం హీరో గా గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే చిత్రం ఇటీవలే థియేటర్స్ లో విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని విజయవంతంగా నడుస్తుంది.’సమ్మతమే’ వంటి డీసెంట్ హిట్ తర్వాత ‘నీ మీకు బాగా కావాల్సినవాడిని’ వంటి డిజాస్టర్ ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకొని డీలాపడిన కిరణ్ అబ్బవరంకి ఈ సినిమా సక్సెస్ కాస్త ఊపిరిని ఇచ్చింది.
కాల్ నైబరింగ్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చింది.ఫలితంగా 5 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి చాలా దగ్గరగా వచ్చింది.ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాల్లోకి అడుగుపెట్టబోతున్న ఈ సినిమా, ఈ 5 రోజులకు గాయానికి ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు ఒకసారి చూద్దాము.
ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం నాలుగు కోట్ల 50 లక్షల రూపాయలకు మాత్రమే జరిగింది.ఒకప్పుడు ఇలా మీడియం రేంజ్ సినిమాలకు కనీసం పది కోట్ల రూపాయిల బిజినెస్ జరిగేది, కానీ ఇప్పుడు 5 కోట్ల రూపాయిల లోపే జరుగుతున్నాయి.కారణం జనాలు ఓటీటీ కి అలవాటు పడడమే.అయితే ట్రేడ్ వర్గాల లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా 5 రోజులకు కలిపి నాలుగు కోట్ల రూపాయిల షేర్ మార్కుకి దగ్గరగా వచ్చిందని తెలుస్తుంది.

బ్రేక్ ఈవెన్ కి ఇక కేవలం 50 లక్షల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చెయ్యాలి.అది ఈ వీకెండ్ లోపే అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.మొత్తం మీద కిరణ్ అబ్బవరం కి ‘SR కల్యాణ మండపం’ తర్వాత క్లీన్ హిట్ ఈ సినిమా ద్వారానే దక్కిందని చెప్పొచ్చు..ఫుల్ రన్ లో ఎంత వరకు ఈ సినిమా షేర్ వసూళ్లను రాబడుతుందో చూడాలి.