
Vijay Deverakonda- Prashanth Neel: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరో కి ఉన్నంత ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఈయనకి యూత్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న క్రేజీ స్టార్ ఈయన. కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన లైగర్ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.
ఈ సినిమా అనుకున్న విధంగా తీసి, హిట్ అయ్యుంటే విజయ్ దేవరకొండ కి ఉండే మార్కెట్ టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న మెయిన్ స్ట్రీమ్ స్టార్ హీరోకి కూడా ఉండేది కాదు, కానీ బ్యాడ్ లక్,ఆయన మూడేళ్ళ కష్టం , శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు లాగ అయ్యింది. అయితే ఇక నుండి ఆయన చెయ్యబొయ్యే సినిమాలన్నీ కూడా ఆచి తూచి చెయ్యబోతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఆయన నిన్ను కోరి ఫేమ్ ‘శివ నిర్వాణ’ తో ఖుషి అనే చిత్రం చేస్తున్నాడు, ఇందులో హీరోయిన్ గా సమంత నటిస్తుంది. ఆమె అనారోగ్యం పాలవ్వడం తో కొంతకాలం వరకు షూటింగ్ ని నిలుపుకున్న ఈ చిత్రం, ఇప్పుడు యధావిధిగా తాజా షెడ్యూల్స్ తో కొనసాగుతుంది.సమంత కూడా లేటెస్ట్ షెడ్యూల్ లో గత కొద్దీ రోజుల నుండి పాల్గొంటుంది.

ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు విజయ్ దేవరకొండ, ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత ఆయన KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చిత్రం చెయ్యబోతున్నట్టు లేటెస్ట్ ఒక వార్త ఫిలిం నగర్ ని చుట్టేస్తోంది. ఇటీవలే విజయ్ దేవరకొండ ని కలిసి కథ వినిపించాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సలార్ మరియు ఎన్టీఆర్ తో తియ్యబొయ్యే సినిమాల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ మీదకి వెళ్లబోతుందట.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.