
Mahesh – Trivikram Movie: ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్న మూవీ మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్. గతం లో వీళ్లిద్దరి కలయిక లో అతడు, ఖలేజా వంటి సినిమాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాలను దక్కించుకోలేదు, కానీ టీవీ టెలికాస్ట్ లో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది.
అందుకే ఈ కాంబినేషన్ అంటే జనాలకు అంత పిచ్చి. సెట్స్ మీద ఉండగానే అప్పుడే క్రేజీ బిజినెస్ ని మొదలు పెట్టింది,ఉగాది రోజున ఈ చిత్రానికి సంబంధించి ఎదో ఒక అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశించారు కానీ చివరికి నిరాశే మిగిలింది.ఇప్పటికే పలు రకాల టైటిల్స్ సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం అయ్యాయి, కానీ లేటెస్ట్ గా ప్రచారం అవుతున్న ఒక టైటిల్ మాత్రం ప్రకంపనలు సృష్టిస్తుంది.
అదేమిటంటే ఈ చిత్రానికి టైటిల్ ‘అమ్మఒడి’ అని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. సినిమా మొత్తం పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్నది కాబట్టి, కథ కి తగ్గట్టుగా ఈ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం.’అమ్మఒడి’ అనేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన ముఖ్యమైన పథకాలలో ఒకటి. ఈ పథకం కి మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా, అయితే ఈ టైటిల్ పై మహేష్ బాబు ఫ్యాన్స్ అభిప్రాయం ఎలా ఉంది అనేది కాసేపు పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఫైర్ మీద ఉన్నట్టు తెలుస్తుంది.

ఎందుకంటే ఈ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి ప్రాణ స్నేహితుడు, పవన్ కళ్యాణ్ మరియు జగన్ ప్రజాక్షేత్రం లో భద్ర శత్రువులు, ఇది అందరికీ తెలిసిందే. అలాంటిది పవన్ కళ్యాణ్ శత్రువు ఉపయోగించిన పేరుని ఆయన సన్నిహితుడివై ఎలా ప్రమోట్ చేస్తావు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ ని తిడుతున్నారు.మరి టైటిల్ అదా కాదా అనేది మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా తెలియనుంది.