Vijay Devarakonda – Rashmika : నిప్పు లేనిదే పొగ రాదు అనేది సామెత. ఎలాంటి ఆధారాలు లేకుండా పుకార్లు పుట్టుకురావు. విజయ్ దేవరకొండ- రష్మిక మందాన మధ్య ఎఫైర్ నడుస్తుందన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. రష్మిక ఈ కథనాలను కొంచెం సాఫ్ట్ గా ఖండించారు. విజయ్ దేవరకొండ మాత్రం తన మార్క్ చూపించాడు. సదరు వార్తలు రాసిన మీడియా సంస్థలను ఉద్దేశిస్తూ ఘాటైన పదాలతో… అంతా షిట్ అంటూ కొట్టిపారేశారు. కానీ వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అబద్ధం చెబుతున్నారన్న సందేహాలు కలుగుతున్నాయి.

న్యూ ఇయర్ వేళ విజయ్-రష్మిక బాగోతం మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వీరిద్దరూ మాల్దీవ్స్ వెకేషన్లో ఉన్నారు. గుట్టుగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం చెక్కేశారు. వేరు వేరుగా చేసిన వీరి ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీవుల దేశంలో జంటగా ఇద్దరూ చిల్ అవుతున్నారని క్లారిటీ వచ్చింది. ఇద్దరూ కలిసి కనిపించకపోయినా… దాని అర్థం అదే అని మెజారిటీ వర్గాల అంచనా. ఆ మధ్యన కూడా రష్మిక-విజయ్ దేవరకొండ మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లడం జరిగింది. ఇక పలుమార్లు ముంబై వీధుల్లో చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.
అన్నీ చేస్తూనే మా మధ్య ఏమీ లేదంటూ జనాల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని నెటిజెన్స్ ఆగ్రహిస్తున్నారు. ఇక రష్మికకు బ్రేక్ ఇచ్చిన చిత్రాల్లో గీతగోవిందం ఒకటి. ఆమె కెరీర్ బిగినింగ్ లో పడిన ఈ రొమాంటిక్ హిట్ మంచి పునాది వేసింది. రష్మిక హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు ఉపయోగపడింది. హీరో విజయ్ దేవరకొండకు కూడా గీతగోవిందం హిట్ బాగా ప్లస్ అయ్యింది. ఆయనకు లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. యూత్ లో విపరీతమైన క్రేజ్ రాబట్టింది.
గీత గోవిందం అనంతరం విజయ్ దేవరకొండ-రష్మిక డియర్ కామ్రేడ్ మూవీ చేశారు. ఈ మూవీలో ఇద్దరూ రొమాన్స్ లో బౌండరీలు బ్రేక్ చేశారు. లిప్ కిస్సులతో రెచ్చిపోయారు. ఆ సినిమా ఫలితం ఇవ్వకపోయినా రష్మిక, విజయ్ ల బంధానికి గట్టి పునాది వేసిందని సమాచారం. డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక పలుమార్లు ప్రత్యక్షం అయ్యారు. విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఇండస్ట్రీకి చెందిన రష్మిక ఒక్కరే హాజరయ్యేవారు. ఈ సంఘటనలు అన్నీ పరిశీలిస్తే విజయ్ తో రష్మిక ఎఫైర్ నిజమే అంటారు.