Vijay Deverakonda-Rashmika : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ కపుల్స్ లో హీరో విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందాన ఎప్పుడు ముందుంటారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక వీరిద్దరూ తమ మధ్య ఉన్న ప్రేమ గురించి ప్రత్యక్షంగా ఎప్పుడు కూడా బయటపడలేదు కానీ పరోక్షంగా మాత్రం హింట్స్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు విజయ్ దేవరకొండ రష్మిక మందాన జంట మీడియా కంట పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక తాజాగా కూడా విజయ్ దేవరకొండ రష్మిక మందాన ఓకే ఎయిర్ పోర్టులో కనిపించి సందడి చేసిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ ఒకే ఎయిర్ పోర్ట్ లో విడివిడిగా వచ్చిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎయిర్ పోర్ట్ లో ముందుగా హీరో విజయ్ దేవరకొండ రావడం జరిగింది. ఇక ఆ తర్వాత వెంటనే హీరోయిన్ రష్మిక మందాన కూడా ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. వీరిద్దరూ కలిసి ఒకే ఎయిర్ పోర్ట్ లో కనిపించటంతో వీరు క్రిస్టమస్ సెలబ్రేషన్స్ కోసం అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఎక్కడికైనా వెకేషన్స్ కి వెళ్తున్నారు కావచ్చు అనే వార్త ప్రస్తుతం వినిపిస్తుంది. ఈ క్రమంలోనే హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ రష్మిక మందాన ఇద్దరు కలిసి ఒక స్టార్ హీరో ఇంటికి వెళ్లినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆ స్టార్ హీరో మరెవరో కాదు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్. బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ ఆలియాభట్లతో, విజయ్ దేవరకొండ రష్మిక మందాన చాలా సన్నిహితంగా ఉంటారు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక రన్బీర్ కపూర్ తో కలిసి రష్మిక మందాన అనిమల్ సినిమాలో జోడిగా నటించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.
అనిమల్ సినిమా టైం నుంచే రణబీర్ కపూర్ అలియాభట్లతో, విజయ్ దేవరకొండ రష్మిక మందాన కు సాన్నిహిత్యం ఏర్పడిందని తెలుస్తుంది. ఆ సాన్నిహిత్యంతోనే విజయ్ దేవరకొండ రష్మిక మందాన ఇద్దరు కలిసి ప్రస్తుతం క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం రన్బీర్ కపూర్ ఇంటికి వెళ్లినట్టు బి టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. రణబీర్ కపూర్ అలియా భట్ ఇంట్లో జరిగే ఈ క్రిస్మస్ వేడుక ఫొటోస్ బయటకు వస్తే విజయ్ దేవరకొండ రష్మిక మందాన రిలేషన్ కూడా బయట పడుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటె విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందాన కలిసి మొదటి సారిగా గీత గోవిందం అనే సినిమాలో కలిసి నటించారు. ఇక అప్పటి నుంచే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది అని చెప్పచ్చు. గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ అనే సినిమాలో కూడా నటించారు. ప్రస్తుతం రష్మిక మందాన నటించిన పుష్ప 2 సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.