Vijay Devarakonda- Rashmika Mandanna: విజయ్ దేవరకొండ-రష్మిక మందాన పెళ్లి చేసుకున్నారా? ఈ ఫోటో నేపథ్యం ఏంటి? అనే చర్చ మొదలైంది. బ్రైడల్ డిజైనర్ వేర్ ధరించి రొమాంటిక్ ఫోజ్ లో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మికల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో విజయ్ దేవరకొండ తలపాగా ధరించాడు. ఇద్దరూ మల్లెమాలలు మెడలో వేసుకున్నారు. నవ వధూవరుల గెటప్ లో ఇద్దరూ మెరిసిపోయారు. కొన్నాళ్లుగా రష్మిక-విజయ్ దేవరకొండ ప్రేమించుకుంటున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే ఇదంతా ఓ అభిమాని చేసిన మాయాజాలం అని తెలుస్తుంది. ఎవరో వధూవరులు ఫోటోను తీసుకొని వారికి విజయ్ దేవరకొండ, రష్మిక ముఖాలు జోడించి మార్ప్ చేశాడు. ఈ మార్ఫింగ్ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. రష్మిక మందాన విజయ్ దేవరకొండ ప్రేమించుకున్నట్లు వార్తలు వస్తుండగా ఈ మార్ఫింగ్ ఫోటో మరింత ఆజ్యం పోసింది.
రష్మికతో కలిసి విజయ్ దేవరకొండ రెండు చిత్రాలు చేశారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు వీరి కాంబినేషన్ లో తెరకెక్కాయి. ఈ చిత్రాల్లో ఇద్దరి కెమిస్ట్రీ, రొమాన్స్ ఒకింత హద్దులు దాటేసింది. లిప్ లాక్ సన్నివేశాల్లో తెగించి నటించారు. ఇక ముంబైలో వీరిద్దరూ పలుమార్లు జంటగా కనిపించారు. ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు. విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే ప్రతి వేడుకకు రష్మిక హాజరవుతున్నారు.
ఇటీవల ఇద్దరూ ఒకేసారి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ దేవరకొండ-రష్మిక మధ్య సంథింగ్ సంథింగ్ అన్న కథనాలు తరచుగా తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా పలుమార్లు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ కథనాలు ప్రచురించడం జరిగింది. అయితే ఈ వార్తలను విజయ్, రష్మిక ఖండిస్తున్నారు. తమదైన శైలిలో ట్రాష్ అంటూ కొట్టిపారేస్తున్నారు.

కాగా ఇటీవల రష్మిక సోషల్ మీడియా కామెంట్స్, నిరాధార కథనాలపై మండిపడ్డారు. ఊరుకునే కొద్దీ మరింత ఎక్కువ చేస్తున్నారు. ఇకపై సహించేది లేదని సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు ప్రచారం కుటుంబ సభ్యులతో పాటు తనను మానసిక వేదనకు గురి చేస్తున్నట్లు సుదీర్ఘ సోషల్ మీడియాలో సందేశంలో వెల్లడించారు.