
Junior NTR- Vijay Devarakonda: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘వార్ 2’ మూవీ లో ఒక హీరో గా నటించబోతున్నాడు అనే వార్త నిన్న సోషల్ మీడియా ని ఏ రేంజ్ లో షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.#RRR తర్వాత సుమారుగా ఏడాది పాటు ఖాళీగా ఉన్న ఎన్టీఆర్ ఈమధ్యనే కొరటాల శివ తో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించాడు.
ఫ్యాన్స్ అందుకు ఎంతో సంతోషించారు, ఆ సంతోషం ని అనుభూతి చెందుతున్న సమయం లోనే నిన్న బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘వార్ 2’ లో హ్రితిక్ రోషన్ తో పాటుగా మరో హీరో గా నటించబోతున్నాడు అనే వార్త ఫ్యాన్స్ ని ఉర్రూతలూ ఊగించింది.సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ.ఇదంతా బాగానే ఉంది కానీ, ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కంటే ముందు మరో క్రేజీ హీరో చెయ్యాల్సి ఉందట.
అతను మరెవరో కాదు విజయ్ దేవరకొండ.ఈ కుర్ర హీరో ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఒక్క సినిమా చెయ్యకపోయినా కూడా క్రేజ్ మాత్రం ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది.ముఖ్యంగా బాలీవుడ్ బడా హీరోయిన్స్ అందరూ విజయ్ దేవరకొండ కి పెద్ద ఫ్యాన్స్.లైగర్ మూవీ షూటింగ్ నడుస్తున్న సమయం లోనే విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ నుండి ఎన్నో క్రేజీ ఆఫర్స్ వచ్చాయి, అందులో ‘వార్ 2’ కూడా ఒక్కటి.

అయితే ఈ సినిమాకి కూడా సిద్దార్థ్ ఆనంద్ డైరెక్టర్ అయ్యి ఉంటే కచ్చితంగా విజయ్ దేవరకొండ నే ఎంచుకునే వారని, అతను కాకుండా అయాన్ ముఖర్జీ డైరెక్టర్ అవ్వడం వల్లే ఎన్టీఆర్ కి ఛాన్స్ దక్కిందని అంటున్నారు.అలా విజయ్ దేవరకొండ చేతి నుండి ఎన్టీఆర్ చేతిలోకి ఈ ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది.ఒకవేళ విజయ్ దేవరకొండ ఈ సినిమా చేసి ఉంటే ఆయన రేంజ్ వేరే లెవెల్ కి వెళ్లి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.