
Vignesh Shivan- Nayanthara: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో నయన తార ఒకరు. హీరోయిన్లు పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు గుడ్ బై చెబుతారు. కానీ నయన్ మాత్రం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పక్కన నటిస్తూ ‘జవాన్’ సినిమా చేస్తోంది. సినిమాలపై ఉన్న ఆసక్తే ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని అంటున్నారు. నయన్ కొన్ని నెలల కిందట డైరెక్టర్ విఘ్నేష్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరు ప్రేమలో ఎలా పడ్డారు? ఎలా కలుసుకున్నారు? అనే విషయాలను సస్పెన్స్ గా ఉంచారు. కానీ ఇటీవల విఘ్నేష్ ఆ సీక్రెట్ ను బయటపెట్టారు. తాను నయన్ తో ఎలా ప్రేమలో పడ్డానో వివరించి చెప్పారు.
విఘ్నేష్ సినిమాల్లోకి రాకముందే నయనతార స్టార్ హీరోయిన్ అయ్యారు. నయన్ ను కలుసుకోవాలంటే విఘ్నేష్ కు అపాయింట్ మెంట్ కూడా దొరకని పరిస్థితి ఉండేది. బలవంతం మీద ‘పోడాపోడీ’ అనే సినిమా తీసినా అది ప్లాప్ కావడంతో గుర్తింపు రాలేదు. ఈ సినిమా తరువాత ‘నేనూ రౌడీనే’ కథను చేతిలో పట్టుకున్న తనకు ఏ నిర్మాత అవకాశం ఇవ్వలేదు. చివరికి ధనుష్ వద్దకు వెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సినిమాను నయన తారతో చెప్పమని సలహా ఇచ్చారు. అయితే అంతకుముందు ఈ కథణు నజ్రియాకు చెబుదామని అనుకున్నా..కానీ నయనతార వద్దకు వెళ్లగా ఆమె గౌరవంగా స్వీకరించారు.

నా కథకు నయనతార ఓకే చెప్పడంతో ఆమెపై ఇంప్రస్ కలిగింది. అప్పుడే ఆమె ప్రేమలోపడ్డా. అయితే కొన్ని రోజుల పాటు షూటింగ్ లో నయన్ ను మేడం అని పిలిచేవాడిని. ఆ తరువాత నా ప్రేమ విషయం చెప్పడంతో నయన్ వెంటనే అంగీకరించింది. అంతకుముందు నయనతార క్యారవాన్ లోకి వెళ్లాలంటే భయపడేవాడిని. కానీ మేమిద్దరం కలిసి క్యారవాన్లో ప్రేమించుకునేవాళ్లం.
నాతో పాటు నయన్ కు కూడా సింపుల్ గా ఉండడం అంటేచాలా ఇష్టం. ఇటీవల మేం పిల్లల కోసం తిరుచ్చిలో ప్రత్యేక పూజలు చేశాం. అక్కడ సమయం ఆలస్యమవుతుందని వారిని తీసుకెళ్లలేదు. అయితే తిరిగి వచ్చేటప్పుడు విమానం ఆలస్యమవుతుందని తెలుసుకొని ట్రైన్లో వచ్చాం. అలా ఆడంబరానికి పోకుండా సింపుల్ లైఫ్ అంటే చాలా ఇష్టం అని విఘ్నేష్ తెలిపారు.