King Cobra: పాము కనిపిస్తేనే బాబోయ్ అంటూ.. ప్రాణ భయంతో పరుగులు తీస్తాం.. కాస్త ధైర్యవంతులైతే.. కర్ర పట్టుకుని పామును తరిమికొట్టడమో.. చంపడమో చేస్తుంటారు. ఇక కోడెనాగు లాంటి పాములైతే ఎంత ధైర్యవంతులైనా జంకుతారు. అత్యంత విషపూరితమైన పామైన కింగ్ కోబ్రా.. ఎదురుపడితే?.. ఒక్కసారిగా వెన్నులో నుంచి వణుకు పుడుతుంది. అత్యంత వేగవంతమైన కదలికలతో ఒక్క కాటుతో మనిషి ప్రాణాల్ని క్షణాల్లో అనంతవాయువుల్లో కలిసిపోయేలా చేస్తుంది. అంతటి విషపూరిత సర్పంతో ఇద్దరు వ్యక్తులు ఆటలాడారు. ఆ పామును.. అటు ఇటు పిలుస్తూ.. దానిని ఏమారుస్తూ.. కాటు నుంచి తప్పించుకుంటూ.. కాసేపు ఆడుకున్నారు. ఆ తరువాత నెమ్మదిగా కింగ్ కోబ్రా తల మీద ముద్దు పెట్టారు. అది కూడా చక్కగా పెంపుడు పాములా తలవంచి.. ముద్దందుకుంది. ఇది చూడడానికి చాలా సరదాగా ఉన్నప్పటికీ.. వాళ్లు ఆటలాడింది. కుక్కపిల్లతో కాదు.. నిలువెత్తు పాముతో అనేది గుర్తొచ్చినప్పుడు.. భయం నరాలను తెగేలా చేస్తుంది.
సోషల్ మీడియాలో వైరల్..
ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. గుర్తుతెలియని అటవీ ప్రాంతంలో ఓ ఇద్దరు యువకులకు కింగ్ కోబ్రా తారసపడింది. అది మనుషుల్లా తన జోలికి రాకపోయినా హాని చేసే గుణం లేనిది కావడంతో తన దారిన తాను వెళ్లిపోతుంది. అయితే వీరు మనుషులు కాబట్టి దానిని ఆటపట్టించాలనుకున్నారు.
ఒకరు వెనుకవైపు నుంచి తోక పట్టుకుని లాగారు. మరొకరు ముందువైపు నుంచి పామును పిలుస్తూ దాన్ని కన్ఫ్యూజ్ చేశారు. దీంతో ఆత్మ రక్షణలో భాగంగా ఆ పాము కాటు వేయాలని ప్రయత్నించింది. కానీ అది ఎన్నిసార్లు కాటు వేయాలని వారిద్దరి వైపు తిరిగినా.. వారు తెలివిగా తప్పించుకున్నారు. అలా చాలా సేపు పామును ఇబ్బంది పెడుతూ ఆటాడుకున్నారు. తన స్ట్రాటజీలో భాగంగానో మరే కారణం చేతనో పాము కాసేపు సైలెంట్ గా మారిపోయింది.
ముద్దు పెట్టిన యువకుడు..
కింగ్ కోబ్రా సైలెంట్ కావడంతో ఓ యువకుడు రెచ్చిపోయాడు. పాము తలపై ముద్దు పెట్టుకున్నాడు. దీన్నంతా మరో వ్యక్తి వీడియో తీశాడు. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిమీద రకరకాల కామెంట్లతో నెటిజెన్లు రెచ్చిపోతున్నారు. ‘పాములని ఇలా ఇబ్బంది పెట్టడం చాలా పాపం’ అని ఒకరు కామెంట్ చేస్తేం ‘ఇంత ప్రమాదకరమైన ఫీట్ అవసరమా’ అంటూ మరొకరు.. ‘పాముని ఇలా ఇబ్బంది పెట్టడం బాలేదు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు చేపట్టాలి’.. అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు. ఈ వీడియో అత్యంత సాహసోపేతంగా ఉండడంతో వేలల్లో లైక్స్ వస్తున్నాయి.
View this post on Instagram