New Delhi Husband And Wife: మనసు మీద నియంత్రణ ఉండాలి.. శరీరం మీద ఆదుపు ఉండాలి. ఆకర్షణను అదిమి పెట్టాలి. అప్పుడే ఒక మనిషి పరిపూర్ణంగా జీవించగలడు.. పదిమందికి ఆదర్శంగా నిలవగలడు. ఇందులో ఏది గాడి తప్పినా మొదటికే మోసం వస్తుంది.. అందుకే సమాజంలో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. సభ్య సమాజం ఇప్పటివరకు చవిచూడని దారుణాలు చోటుచేసుకుంటున్నాయి.. సరిగ్గా ఇలాంటి మనస్తత్వం ఉన్న ఓ మహిళ.. రకరకాల బంధాలకు అలవాటు పడింది.. ఏ బంధాన్ని అయితే ఆమె కోరుకున్నదో… అదే ఆమెను హతమార్చింద

దారుణం
ఆమె అసలు పేరు బేబీ… మూడో పెళ్లి నాటికి ఆమె పేరు భవ్య శర్మగా మారింది.. వయసు 35 సంవత్సరాలు.. ఇటుకతోనే ఆమె ముస్లిం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ ఆమె స్వస్థలం.. తొలి వివాహం ఓ హిందువుతో జరిగింది.. తర్వాత ఆమె పేరును అంజలిగా మార్చుకుంది.. పెళ్లయిన కొన్ని సంవత్సరాలకు అతడికి ఆమె విడాకులు ఇచ్చింది.. తర్వాత ఒక ముస్లింని పెళ్ళాడింది.. అప్పుడు తన పేరును అప్సానాగా మార్చుకుంది. కొన్నాళ్లకు అతడితోనూ తెగతెంపులు చేసుకుంది.. వినోద్ శర్మ అనే హిందువును వివాహం చేసుకుంది. తర్వాత తన పేరును భవ్య శర్మగా మార్చేసుకుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది.. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది.
విగత జీవిగా
ఈనెల 26న ఆమెను ఘజియాబాద్ లో తన ఫ్లాట్లో విగత జీవిగా ఉండగా పోలీసులు గుర్తించారు. పోలీసులు విచారించగా ఆమె భర్త వినోద్ శర్మ తప్పుదోవ పట్టించాడు.. ఆయుర్వేద మందులను పంపిణీ చేసే తన భార్య మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నుంచి 25న రాత్రి ఇంటికి వచ్చిందని… ఇద్దరం కలిసి మద్యం తాగామని, తెల్లారేసరికి ఆమె మృతి చెందిందని చెప్పాడు.. అయితే పోస్టుమార్టం రిపోర్టులో ఆమె హత్యకు గురైందని తేలింది.. పోలీసులకు అనుమానం వచ్చి వినోద్ శర్మను అదుపులోకి తీసుకున్నారు.. వారి శైలిలో విచారించగా తానే చంపినట్టు ఒప్పుకున్నాడు.

ఇదీ జరిగింది
వినోద్ కు అప్సానా( భవ్య శర్మ) తో 2019లో పరిచయం ఏర్పడింది.. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.. అప్పటికే ఆమెకు రెండో భర్త ద్వారా జన్మించిన ఆదిల్ అనే కుమారుడు ఉన్నాడు.. ఆదిల్ తో కలిసి భవ్య శర్మ వినోద్ ఇంటికి వచ్చింది.. మందులు సరఫరా చేసే ఉద్యోగంలో ఉన్న భవ్య సంపాదనతోనే వినోద్ ఇల్లు గడిచేది. కొన్నిసార్లు ఆమె ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యేది. వినోద్ మాత్రం ఆదిల్ బాగోగులు చూసుకుంటూ ఉండేవాడు.. అయితే ఇదే క్రమంలో భవ్య శర్మ తన రెండవ భర్త అనీస్ తో బంధాన్ని కొనసాగించడం ప్రారంభించింది. ఈనెల 24న ఇండోర్ లో ఉన్న భవ్యకు వినోద్ వీడియో కాల్ చేశాడు . ఆమె పక్కన రెండో భర్త అని అతడు చూశాడు.. అంతేకాదు వినోద్ ను అతడు బెదిరించాడు. వెంటనే ఘజియాబాద్ వదిలి వెళ్లాలని, లేకుంటే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు.. అయితే దీంతో కోపంతో ఊగిపోయిన వినోద్ శర్మ భవ్య తనను మోసం చేసిందని తెలుసుకున్నాడు. మరుసటి రోజు ఇండోర్ నుంచి తిరిగి వచ్చిన భవ్యకు ఫుల్లుగా మద్యం తాగించి.. ఆమె నిద్రలోకి జారుకోగానే కత్తితో పొడిచి చంపాడు. భవ్య శర్మ ముగ్గురిని పెళ్లి చేసుకుంది. ముగ్గురు భర్తల్లో ఇద్దరు హిందువులు.. ఒకరు ముస్లిం.. ఇందుకోసం ఆమె రెండుసార్లు మతాన్ని, మూడుసార్లు పేర్లు మార్చుకుంది.. మూడో భర్తతో ఉంటూనే.. రెండో భర్తతో సంబంధాన్ని కొనసాగించింది.. ఇప్పుడు అదే ఆమె ప్రాణాలను బలి తీసుకుంది.