
అందమా? అందుమా? అన్నట్టుగా జబర్ధస్త్ యాంకర్ అనసూయ అందాలు అన్నీ ఇన్నీ కావు.. బుల్లితెరపై అలరిస్తూ వెండితెరపై మెరిపిస్తూ అనసూయ చేసే అల్లరికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
ఒకవైపు యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు సినిమాలు చేస్తున్న అనసూయ మరోసారి అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ‘థ్యాంక్ యూ బ్రదర్’ సినిమాలో నటిస్తోంది. వీటితోపాటు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తండ, రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఖిలాడి’లోనూ కీలక పాత్రలో నటిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో అనసూయ తన అందాలతో అలరించింది.
ప్రస్తుతం అనసూయ రవితేజ ‘ఖిలాడి’ సినిమా కోసం ఇటలీ వెళ్లింది. అక్కడి ప్రకృతిని అస్వాదిస్తూ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
వీడియో కోసం క్లిక్ చేయండి