
Victory Venkatesh- Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూ పోతుంది.ముఖ్యంగా #RRR సినిమా తర్వాత ఆయన పాన్ ఇండియన్ స్టార్ గా మాత్రమే కాదు, గ్లోబల్ స్టార్ గా తిరుగులేని స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నాడు.హాలీవుడ్ దిగ్గజాల ప్రశంసలను అందుకోవడం అనేది ఎవరికైనా ఒక కల.రామ్ చరణ్ #RRR సినిమాలోని తన నటన తో జేమ్స్ కెమరూన్ , స్పీల్ బర్గ్ వంటి హాలీవుడ్ దర్శకులను సైతం మైమరచిపొయ్యేలా చేసాడంటే ఆయన టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఇక రీసెంట్ గా HCA అవార్డ్స్ ఫంక్షన్ లో స్పాట్ లైట్ అవార్డు ని గెల్చుకున్న రామ్ చరణ్, అదే అవార్డ్స్ ఈవెంట్ లో ‘బెస్ట్ వాయిస్/ మోషన్ కాప్చర్’ విభాగానికి అవార్డు ప్రెజెంటర్ గా కూడా వ్యవహరించాడు.ఇప్పటి వరకు ఏ ఇండియన్ కి కూడా ఇలాంటి అదృష్టం దక్కలేదు.అందుకు రామ్ చరణ్ ని ప్రతీ సినీ సెలబ్రిటీ పొగడ్తలతో ముంచి ఎత్తేస్తున్నారు.
వారిలో రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ కూడా చేరాడు..రీసెంట్ గానే అమెరికాలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొన్న వెంకటేష్,అదే ఫంక్షన్ కి గెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ ని చూసి, వెంటనే మైక్ అందుకొని ‘ఇతను నాటు నాటు సాంగ్ తో ప్రపంచం మొత్తాన్ని ఊపేసాడు.మనోడు ప్రతీ అవార్డు ని గెలుచుకునేందుకు అర్హుడు’ అంటూ వెంకటేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.మరోపక్క చిరంజీవి , పవన్ కళ్యాణ్ కూడా రామ్ చరణ్ ని ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఈ అవార్డ్స్ ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ రాలేకపోవడం పై అభిమానులు నిరాశని వ్యక్తపరుస్తున్నారు.ఈమధ్యనే ఎన్టీఆర్ సోదరుడు నందమూరి తారకరత్న చనిపోవడం తో నందమూరి కుటుంబం మొత్తం శోకసంద్రం లో మునిగిపోయి ఉంది, ఇలాంటి సమయం లో అవార్డ్స్ ఫంక్షన్స్ లో పాల్గొని సంబరాలు చేసుకోవడం సరికాదని ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కి దూరం గా ఉన్నాడు.కానీ ఆస్కార్ అవార్డ్స్ కి మాత్రం కచ్చితంగా వస్తాడని తెలుస్తుంది.