అసలే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. వివాదాన్ని కెలికి మరీ రాజేస్తాడు వర్మ. సినీ, రాజకీయ ప్రముఖులను ఇప్పటికే కెలికేశాడు. ప్రతీ సందర్భాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని వర్మ చేసే హంగామా అంతా ఇంతా కాదు..
అలాంటి కాంట్రవర్సీ వర్మకు.. బోల్డ్ బ్యూటీ అరియానా జోడు అయ్యింది. బిగ్ బాస్ తో ఫైర్ బ్రాండ్ గా మారిన అరియానా తన అందచందాలతో వర్మ ముందే బికినీలు వేసుకొని జిమ్ లో వర్కవుట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. వీరి బోల్డ్ ఇంటర్వ్యూ గురించే సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఆ ఇంటర్వ్యూ తెగ వైరల్ అవుతోంది.
వర్మ-అరియానా ఇంటర్వ్యూపై ఇప్పుడు నెటిజన్లు తమ సృజనాత్మకతను జోడించి తెగ ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. అవిప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి.
తాజాగా తన బోల్డ్ ఇంటర్వ్యూపై నెటిజన్ల కామెంట్స్, మీమ్స్, ట్రోల్స్ ను జతచేసి ఆ వీడియోను వర్మ తన యూట్యూబ్ చానెల్ లో రిలీజ్ చేశాడు. తన ఇంటర్వ్యూ పై తనే సెటైర్లు వేసుకున్న ఈ వ్యవహారం ఆసక్తి రేపుతోంది. ఆ వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.