
Money Plant Vastu: ఇంటి ఎదుట మొక్కలు పెంచుకోవడం సాధారణమే. కాకపోతే ఏ మొక్కలు నాటుకుంటే మంచిది. శుభ యోగం కలగాలంటే ఏం చేయాలి? ఏ పరిహారాలు పాటించాలి? అనే వాటిపై అందరికి ఆసక్తి ఉంటుంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఉండాలంటే కొన్ని రకాల మొక్కలు పెంచుకోవడం సహజమే. ఈ నేపథ్యంలో మనీప్లాంట్ ప్రయోజనాల గురించి తెలిస్తే దాన్ని నాటుకోకుండా ఉండలేం. వాస్తు పరంగా ఇది మనకు ఎన్నో శుభాల్ని కలిగిస్తుంది. మనీప్లాంట్ స్థానం, దిశ, ఆర్థిక, మానసిక స్థితులపై ప్రభావం చూపుతుంది.
మనీప్లాంట్ సంపద అందిస్తుంది. దాని పేరుకు తగ్గట్లుగానే ఆర్థిక అడ్డంకులను తొలగించడంలో సాయపడుతుంది. ఇంటికి అదృష్టం పట్టేందుకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. వాస్తు శాస్త్రంలో మనీప్లాంట్ కు ముఖ్యమైన పాత్ర ఉంటుంది. అయితే మనీప్లాంట్ ను ఎక్కడ నాటుకుంటే మంచి జరుగుతుందనే దానిపై అందరికి కొన్ని అనుమానాలు ఉంటాయి. మనీప్లాంట్ నాటుకునే విషయంలో కొన్ని పద్ధతులు పాటించాల్సిందే. మనీ ప్లాంట్ ఇంటి ఆవరణలో ఉంచుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి.
వాస్తు ప్రకారం మనీప్లాంట్ ఆగ్నేయ దిశలో నాటుకోవడం మంచిది. ఆగ్నేయ దిశకు గణేషుడు అధిపతి అయినందున అడ్డంకులు తొలగించి మనకు ఆర్థిక శ్రేయస్సు కలిగేందుకు సాయపడుతుంది. గణేషుడి ఉనికి, శుక్ర గ్రహం రెండు సంపద కలిగించేందుకు దోహదపడుతుంది. మనీప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈశాన్య దిశలో నాటుకోకూడదు. ఈ దిశలో ఉంచితే మనకు ప్రతికూలతలు ఎదురవుతాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఉత్తర ద్వారం ఉన్నట్లయితే మనీప్లాంట్ ఉత్తర దిశగా ఉంచుకోవచ్చు. ఇది మనకు ఎంతో మేలు కలగజేస్తుంది. కెరీర్ మంచి మార్గంలో వెళ్తుంది. మనీప్లాంట్ పైకి ఎదిగితే మనకు మంచి జరుగుతుంది. ఈ చెట్టు ఆకాశం వైపు పెరిగితే మనకు సానుకూల శక్తి లభిస్తుంది. నీటిని తరచుగా మార్చాలి. ఎక్కువ నీరు పెట్టొద్దు. మొక్కను తరచూ కత్తిరించాలి. ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. కృత్రిమ ఎరువులు, పురుగుమందులు వాడొద్దు. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, వైఫై రూటర్, పరికరాలు ఉంటే రేడియేషన్ తో ఈ మొక్కకు నష్టం జరగొచ్చు. అందుకే జాగ్ర్తత్తలు పాటించాలి.